కాన్యే అధ్యక్షుడిగా పోటీ చేయచ్చు..కానీ  

Donald Trump on Kanye West Presidential Bid, Donald Trump, Kanye West, US Presidental Elections - Telugu Donald Trump, Donald Trump On Kanye West Presidential Bid, Kanye West, Us Presidental Elections

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్న నేపధ్యంలో సర్వాత్రా ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడుగా ఎవరు ఎన్నిక అవుతారోనని ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది.

 Kanye West Us Presidental Bid Donald Trump

అయితే డెమోక్రటిక్ పార్టీ నుంచీ బిడెన్ అధ్యక్ష అభ్యర్ధిగా ఖరారయిన విషయం విధితమే.రిపబ్లికన్ పార్టీ నుంచీ ట్రంప్ ముందు నుంచీ బరిలో నిలిచున్నారు.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నానంటూ కాన్యే వెస్ట్ చేసిన ప్రకటన ఒక్క సారిగా అమెరికా రాజకీయాలని కుదుపు కుదిపేసింది…అయితే

కాన్యే అధ్యక్షుడిగా పోటీ చేయచ్చు..కానీ-Telugu NRI-Telugu Tollywood Photo Image

కాన్యే వెస్ట్ రాజకీయ ప్రకటనపై ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు.కాన్యే పోటీ చేయాలనీ అనుకోవడం ఎంతో ఆసక్తిగా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

నిన్నటి రోజున వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ కాన్యే పోటీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.కాన్యే పోటీ చేయవచ్చు, అయితే పోటీ చేసే పక్షంలో అతడికి ఓ అనుభవం ఎదురవుతుంది అదేంటంటే గడించిన నాలుగేళ్ళలో ఏమి జరగబోతోంది అనేది తెలుసుకోవడానికి అతడి అభ్యర్ధిత్వం ఉపయోగ పడుతుందని అన్నారు.

అంతేకాదు అతడికి అన్ని రాష్ట్రాలలో తగినంత బలం , బలగం లేదని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే రిపబ్లికన్ పార్టీ తరుపునుంచీ కాన్యే పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఒక్కసారిగా అమెరికన్స్ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దాదాపు 10 లక్షల మంది అతడి అభ్యర్ధిత్వానికి ఆమోదంగా లైక్స్ ఇచ్చారు.పోటీ బరిలో ఉన్నానని చెప్పిన కాన్యే ఇప్పటి వరకూ ప్రచారానికి సంభందించిన వివరాలు కానీ, ఇతరాత్ర అంశాలు కానీ ఇప్పటికి వెల్లడించక పోవడం గమనార్హం.

అయితే అమెరికాలో బాగా బిలీనియర్స్ కొందరు కాన్యే కి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.

#Donald Trump #Kanye West

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kanye West Us Presidental Bid Donald Trump Related Telugu News,Photos/Pics,Images..