ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.కాంతార సినిమా ఇప్పటికే థియేటర్లలో హిట్ కావడంతో పాటు బుల్లితెరపై కూడా హిట్ గా నిలిచింది.పది రోజుల క్రితం స్టార్ మ ఛానల్ లో ఈ సినిమా ప్రసారం కాగా ఈ మూవీకి ఏకంగా 12.6 రేటింగ్ వచ్చింది.చాలా తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే ఈ రేటింగ్ బెటర్ రేటింగ్ అనే సంగతి తెలిసిందే.
వాస్తవానికి కాంతార కథ, కథనం మరీ గొప్పగా లేకపోయినా రిషబ్ శెట్టి తన నటనతో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు.
కాంతార మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుండగా నిర్మాత చెప్పిన వివరాల ప్రకారం 2024 చివర్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.కాంతారను మించి కాంతార సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తారా? లేక మరో స్టార్ హీరో నటిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార సీక్వెల్ కు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.రిషబ్ శెట్టికి ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చింది.కాంతార మూవీ కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.కాంతార2 సినిమాను చిన్న సినిమాగా రిలీజ్ చేసిన నిర్మాతలు ఈ సినిమాతో కళ్లు చెదిరే లాభాలను చవిచూశారు.

హోంబలే నిర్మాణ సంస్థ సౌత్ ఇండియాలోనే సక్సెస్ ఫుల్ బ్యానర్లలో ఒకటి.ఈ బ్యానర్ లో సినిమా తెరకెక్కితే హిట్ అనే భావన ఇండస్ట్రీలో ఉంది.టాలెంటెడ్ డైరెక్టర్లను ఈ సంస్థ ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం.రిషబ్ శెట్టి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.