రిషబ్ శెట్టి సప్తమి గౌడ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కాంతారా.చిన్న సినిమాగా వచ్చిన కన్నడ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో సత్తా చాటుతూ అందరి కళ్ళు ఆ సినిమా వైపుకు తిప్పుకుంటుంది.
ఈ చిన్న సినిమా విజయాన్ని చూసి అందరు ఈ సినిమా గురించే చర్చించు కుంటున్నారు.కాంతారా కన్నడ లోనే కాకుండా రిలీజ్ అయినా అన్ని చోట్ల రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమా 2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 400 కోట్ల మార్క్ చేరుకునేందుకు దూసుకు పోతుంది.2022 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 50 రోజుల రన్ టైం లో ఎన్నో రికార్డులను చెరుపుకుంటూ వస్తుంది.ఒక డబ్బింగ్ సినిమా అది కూడా కన్నడ వంటి చిన్న ఇండస్ట్రీ నుండి వచ్చి ఈ రేంజ్ లో అన్ని భాషల్లో వసూళ్లు రాబట్టడం అనేది అందరికి షాకింగ్ విషయమే.
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కొత్త రికార్డులను నెలకొల్పుతుంది.
తెలుగులో కాంతారా సినిమా ఏకంగా 65 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.ఈ ఏడాది కేజిఎఫ్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డ్ కెక్కింది.
అలాగే ఆల్ టైం అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల జాబితా తెలుగులో టాప్ 4 గా నిలిచి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ లిస్టులో ముందు వరుసలో కేజిఎఫ్ 2 185 కోట్ల వసూళ్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.ఇక 2.0 సినిమా 100 కోట్లతో.రోబో 72 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.ఇక ఇప్పుడు 65 కోట్లతో కాంతారా నాలుగవ స్థానంలో నిలవగా.ఐదవ స్థానంలో ఐ సినిమా 57 కోట్లతో నిలిచింది.ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాల్లో తమిళ్ సినిమాలు మాత్రమే తెలుగులో సత్తా చాటగా ఇప్పుడు కొత్తగా కన్నడ సినిమాలు ఈ ఏడాదిలోనే టాప్ 5 లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసాయి.