హెచ్ఐవీ వుందని ఉద్యోగంలోంచి తీసేశారు: కోర్టును ఆశ్రయించిన బాధితుడు

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా… కొన్ని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మనుషుల్ని విడిచి వెళ్ళటం లేదు.హెచ్ఐవీ అంటరాని వ్యాధని ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు మాత్రం ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివిక్ష చూపిస్తూనే ఉన్నారు.

 Kansas Restaurant Chain Forced Out Employees With Hiv-TeluguStop.com

తాజాగా హెచ్‌ఐవీ సోకిందనే ఓ వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు ఓ అధికారి.

వివరాల్లోకి వెళితే.

కన్సాస్‌కు చెందిన అర్మాండో గిటెర్రెజ్ ది బిగ్ బిస్కట్ రెస్టారెంట్‌లో పనిచేసేవాడు.ఈ క్రమంలో అతనికి గతేడాది హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చింది.

ఇదే విషయాన్ని తన మేనేజర్ వద్ద ప్రస్తావించగా… అతను ఏమాత్రం జాలి చూపించకపోగా, ఉద్యోగంలోంచి తీసేశాడు.కంపెనీ అందించే ఆరోగ్య బీమా లేకపోవడం వల్ల దానికి దరఖాస్తు చేసుకోవడానికే అర్మాండో మేనేజర్ సంతకాన్ని తీసుకోవాలనుకున్నాడు.

Telugu Employees Hiv, Kansas-

అయితే తనను కొత్త షెడ్యూల్ ప్రకారం విధుల్లోకి రావాల్సిందిగా మేనేజర్ కోరాడని తెలిపాడు.ఆదివారాలు సైతం పనిచేయాలన్నది నిబంధన.అయితే ఈ కొత్త షెడ్యూల్‌లో తాను పనిచేయలేనని అర్మాండో మేనేజర్ వద్ద మొరపెట్టుకున్నాడు.దీంతో మరో మాట లేకుండా అతనిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు మేనేజర్ ఆదేశించాడు.

దీనిపై తీవ్ర అసంతృప్తికి లోనైన అర్మాండో కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు.ఇతని పిటిషన్‌పై స్పందించిన ది బిగ్ బిస్కెట్ సంస్థ అటార్నీ… గిటెర్రెజ్ అసలు ఏ నష్టపరిహారం కోసం దావా వేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube