సిబ్బందిపై లైంగిక వేధింపులు, నేరస్థురాలితో అక్రమ సంబంధం: కన్సాస్ ఫెడరల్ జడ్జికి చీవాట్లు

మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు నేరస్థులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అభియోగాలపై కన్సాస్‌లోని జిల్లా జడ్జి కార్లోస్ ముర్గియాపై జ్యుడీషియల్ కౌన్సిల్ మండిపడింది.ఆయనపై వచ్చిన ఆరోపణలపై 10వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ విచారణ జరిపి మొత్తం 23 మంది వాంగ్మూలం సేకరించింది.

 Kansas Judge Carlos Murguiareprimanded Forsexualharassment-TeluguStop.com

Telugu Carlos Murguia, Kansasjudge, Sexual, Telugu Nri Ups-

  కార్లోస్ తను చేసిన నేరాలను అంగీకరించి క్షమాపణల చెప్పారని భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు తాను పాల్పడనని న్యాయస్థానానికి తెలిపినట్లు చీఫ్ జడ్జి తిమోతి టిమ్కోవిచ్ వెల్లడించారు.మరోవైపు ఫిర్యాదు అందిన తర్వాతి నుంచి కార్లోస్ తన ప్రవర్తన మార్చుకున్నాడని.చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి స్వయంగా ముందుకొచ్చారని స్పెషల్ కమిటీ పేర్కొంది.

కాగా కార్లోస్ ముర్గియాను 1999లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ కన్సాస్ ఫెడరల్ బెంచ్ న్యాయమూర్తిగా నియమించారు.

తద్వారా మిస్సోరి రాష్ట్రానికి మొదటి స్పానిస్ తరగతికి చెందిన ఫెడరల్ జడ్జిగా కార్లోస్ రికార్డుల్లోకి ఎక్కారు.ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయన పోటీపడ్డారు.

అయితే ఆయన సోనియా సోటోమేయర్‌వైపు మొగ్గుచూపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube