సాయం చేయడానికి వెళ్ళాడు… యాచాకురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు  

Kanpur Auto Driver Marriage - Telugu Begging, Corona, Humanity, Kanpur Driver Finds Life Partner In Beggars, Lock Down

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లోకి దేశం మొత్తం వెళ్ళిపోయింది.ప్రజలందరూ ఈ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు.

 Kanpur Auto Driver Marriage

వలస కార్మికులు అందరూ సొంతూళ్ళకి వెళ్ళారు.ఇక రోడ్డున పడి భిక్షాటన మీద బ్రతికేవాళ్ళ బ్రతుకు అగమ్యగోచరంగా మారింది.

ఇలాంటి పరిస్థితిలో రోడ్డున ఉన్న వారికి చాలా మంది సాయం చేయడానికి ముందుకొచ్చారు.ప్రతి ఒక్కరు తమలోని మానవత్వాన్ని బయటకి తీసి తమతోటి వారికి సాయం చేయడం ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ చూసారు.

సాయం చేయడానికి వెళ్ళాడు… యాచాకురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రతి ఒక్కరిలో మానవత్వం, మంచితనం ఇంకా బ్రతికే ఉందని నిరూపించారు.ఇదే సమయంలో ఓ వ్యక్తి తనలోని ప్రేమతో ఓ యాచాకురాలిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది.కాన్పూర్ కు చెందిన నీలమ్ తండ్రి మరణించగా, తల్లి కూడా ఈ లోకాన్ని కొంత కాలం తర్వాత చనిపోయింది.

అన్నా వదినల పంచన చేరిన నీలమ్ కు వేధింపులు ఎదురయ్యాయి.వారు ఇంటి నుంచి బయటకి గెంటేశారు.దాంతో చేసేది లేక రోడ్డుపై భిక్షాటన చేయడం మొదలుపెట్టింది.లాక్ డౌన్ విధించడంతో ఆమెకు భిక్షం వేసేవాళ్లే కరవయ్యారు.

దాంతో ఆమె కడుపునిండా తిండిలేక అలమటించింది.ఈ క్రమంలో నీలమ్ కు ఆటోడ్రైవర్ అనిల్ పరిచయం అయ్యాడు.

ఓ రోజు ఆహారం పంపిణీ చేస్తుండగా నగరంలోని ఓ క్రాసింగ్ వద్ద యాచన చేస్తున్న నీలమ్ ను చూశాడు.అతని మనసు కరిగిపోయింది.

ఆమె వివరాలు తెలుసుకున్న తర్వాత మరింత ఇష్టం కలిగింది.ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడమే కాదు, కొన్నిరోజుల్లోనే అది ప్రేమగా మారింది.

ఆ ఆటో డ్రైవర్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి లాక్ డౌన్ టైంలోనే ఆమెని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు.ఇప్పుడు ఈ సంఘటన గురించి స్థానికంగా కొందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు