ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ టీవీ నటి కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా అయితే హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం నేను టిప్స్, సలహాలు పాటించడంతో పాటు ఇంకా అందంగా కనిపించడం కోసం శస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటూ ఉంటారు.

 Kannada Tv Actress Chethanaraj Died Of Fat Free Treatment , Actress Chethanaraj-TeluguStop.com

అయితే ఇలాంటి సందర్భాలలోనే చాలా మంది హీరోయిన్లు చికిత్సలు ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.టాలీవుడ్ లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా సన్నబడే క్రమంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో నటి కూడా ఇలాగే మరణించింది.కన్నడ టీవీ ఈ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చేతనారాజ్ తమ అందానికి మెరుగులు దిద్దుకునే క్రమంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనుకుంది.

ఈ క్రమంలోనే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదిలింది.ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది.అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న చేతనారాజు కొద్దిరోజుల్లోనే అస్వస్థతకు గురైన ఊపిరితిత్తులలో ద్రవాలు అధికంగా చేరడంతో తుది శ్వాస విడిచింది.అయితే ఆమెను వైద్యులు కాపాడాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేక పోయింది.

Telugu Fat, Kannada Actress, Plastic Surgery, Soap-Movie

అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది అంటూ ఆరోపిస్తున్నారు.ఈమె కేవలం సీరియల్స్ ద్వారానే కాకుండా పలు సోపుల యాడ్స్ లో కూడా నటించిన విషయం తెలిసిందే.బెంగళూరు రాజాజీ నగర్ లోని శెట్టి కాస్మోటిక్ సెంటర్ లో ఫ్రీ ఫ్యాట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.చేతనారాజ్ మృతి విషయం తెలుసుకున్న పలువురు కన్నడ టీవీ నటీనటులు అదేవిధంగా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అయితే ఆమెతోపాటు గా పనిచేసే సీరియల్ నటి నటులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube