విలనిజం చూపించడానికి రెడీ అవుతున్న కన్నడ సూపర్ స్టార్

కన్నడనాట సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో ఉపేంద్ర.అందరి హీరోల తరహాలో కాకుండా విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వచ్చి తన రూటే సెపరేటు అనే ఉపేంద్ర కెరియర్ లో ఎక్కువగా నెగిటివ్ హీరోయిజంతోనే విజయాలు అందుకున్నాడు.

 Kannada Super Star Upendra Ready To Act Villon Roles, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

దర్శకుడుగా మొదటిగా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారి తన సినిమాలకి తానె కథలు అందించుకొని ఏ, రా, రక్త కన్నీరు లాంటి సినిమాలు తీసాడు.ఇక అతని సినిమాలతో కన్నడ నాట తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

ఇక తెలుగులో కూడా ఉపేంద్ర సినిమాలని ఇష్టపడే ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు.ఈ నేపధ్యంలో అతని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి.

ఇక తెలుగు స్ట్రైట్ సినిమాల ద్వారా ఉపేంద్ర ఇక్కడి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.కన్యాదానం సినిమాలో ఉపేంద్ర సినిమా పాత్ర ఇప్పటికి గుర్తుండిపోతుంది.

అలాగే టాస్, సెల్యూట్ అనే సినిమాలలో కీలక పాత్రలు చేసాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేసిన పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

ఆ పాత్ర తెలుగులో కూడా ఉపేంద్రకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అయితే మరల ఆ స్థాయిలో పాత్రలు వచ్చిన తెలుగులో ఉపేంద్ర చేయలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సూపర్ స్టార్ తనలోని విలనిజం చూపించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఉపేంద్ర కంప్లీట్ విలన్ రోల్ చేయడానికి నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని సమాచారం.

ఇక ఉపేంద్రని విలన్ గా వాడుకుంటే సౌత్ లో జగపతిబాబు తర్వాత ఆ స్థాయిలో పవర్ ఫుల్ విలన్ గా మారే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube