మెగా ప్రిన్స్ మూవీలో కన్నడ సూపర్ స్టార్

విభిన్న చిత్రాలతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.ఎక్కువగా కన్నడ నాట సినిమాలు చేసిన కూడా ఉపేంద్ర డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా భాగా దగ్గరయ్యాడు.

 Kannada Super Star Upendra Key Role In Varun Tej Movie-TeluguStop.com

ఉపేంద్ర అంటే అందరికి ఏ, రక్త కన్నీరు, రా లాంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాలు గుర్తుకొస్తాయి.ఇప్పటికి కూడా సినిమాల ఎంపిక విషయంలో డిఫరెంట్ జోనర్ ని ట్రై చేసే ఉపేంద్ర అప్పుడప్పుడు తెలుగు సినిమాల ద్వారా ఇక్కడి ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేసిన పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పాలి.ఆ సినిమా తర్వాత తాజాగా కబ్జా అనే మూవీని తెలుగులో ఉపేంద్ర మొదలుపెట్టాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెగా హీరో సినిమా కోసం ఉపేంద్ర వస్తున్నట్లు తెలుస్తుంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా కిరణ్ కొర్రపాటి అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.ఇదిలా ఉంటే ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

దీనికోసం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుపుతున్నారని సమాచారం.పాత్ర నచ్చితే చేయడానికి రెడీ అని ఉపేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్.

అన్ని అనుకూలంగా జరిగితే ఉపేంద్ర ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది.అదే జరిగితే సినిమా మీద మరింత హైప్ రావడం గ్యారెంటీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube