ఆదిపురుష్‌ లో ఆ సూపర్‌ స్టార్ నిజమేనా?

ప్రభాస్ బాలీవుడ్‌ లో ఇప్పటికే సూపర్‌ స్టార్‌ అనే విషయం తెల్సిందే.అయితే ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన తెలుగు సినిమా లు హిందీలో డబ్బింగ్‌ అవుతూ వచ్చాయి.

 Kannada Super Star In Prabhas Bollywood Movie Adipurush-TeluguStop.com

మొదటి సారి ఆదిపురుష్‌ సినిమా తో నేరుగా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు.హిందీ లో ఆదిపురుష్‌ తో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్‌ అంచనాలు పెంచేస్తున్నాడు.

ఈ సినిమా లో రాముడి గా ప్రభాస్ కనిపించబోతున్నాడు.ఇక రావణాసూరుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే.

 Kannada Super Star In Prabhas Bollywood Movie Adipurush-ఆదిపురుష్‌ లో ఆ సూపర్‌ స్టార్ నిజమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఆది పురుష్‌ సినిమా లో మరో సూపర్‌ స్టార్‌ ను కూడా నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కన్నడ సూపర్‌ స్టార్‌ కిచ్చ సుదీప్‌ తో చర్చలు జరిపారనే వార్తలు వస్తున్నాయి.

త్వరలో హైదరాబాద్‌ లో జరుగబోతున్న ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ లో సుదీప్‌ పాల్గొంటాడని సమాచారం అందుతోంది.ఇప్పటికే తెలుగులో కిచ్చ సుదీప్‌ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఇప్పుడు మరో సారి తెలుగులో ఆయన నటించేందుకు సిద్దం అయ్యాడు.తెలుగులో ఆయన నటిస్తున్న సినిమాలకు మంచి బిజినెస్‌ అవుతుంది.

అందుకే ఆదిపురుష్‌ లో కూడా ఆయన్ను ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలీవుడ్‌ లో సుదీప్‌ కు గుర్తింపు ఉంది.

కనుక ఈ పాన్ ఇండియా సినిమాలో ఆయన్ను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.ఆదిపురుష్‌ సినిమా కీలక సన్నివేశాలను ముంబయిలో చిత్రీకరించారు.త్వరలోనే హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమాను చిత్రీకరించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.300 కోట్లు వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కు కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో సినిమా ఏ రేంజ్ లో విజువల్‌ వండర్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అద్బుతాలను ఆవిష్కరించే ఓం రౌత్‌ మరోసారి ఖచ్చితంగా ఈ సినిమా తో ఆకట్టుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

#Adipurush #Prabhas #Kicha Sudeep

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు