కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మూవీ.. వేద శివరాజ్ కుమార్

గత సంవత్సరం కన్నడ సినిమా పరిశ్రమ నుండి కేజిఎఫ్ 2 మరియు కాంతార సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో కూడా అందరికీ తెలిసిందే.

 Kannada Super Hit Movie Veda Ready For Release In Telugu States,kannada Movie,kg-TeluguStop.com

అంతటి విజయాన్ని మరో కన్నడ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద నమోదు చేయబోతుంది అంటూ వేద సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తోంది.శివరాజ్ కుమార్ హీరో గా నటించిన వేద సినిమా గత సంవత్సరం డిసెంబర్ లో కర్ణాటకలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

శివరాజ్ కుమార్ సొంతంగా నిర్మించిన ఈ సినిమా కి హర్ష దర్శకత్వం వహించాడు.అర్జున్ జన్య సంగీతాన్ని సమకూర్చారు.

ఫిబ్రవరి 9వ తారీఖున తెలుగు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున రాబోతున్న వేద సినిమా పై తాజాగా విడుదల అయిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది.వేద.అతడికి భయమంటే ఏమిటో తెలియదు, క్షమించడం అంటే ఏమిటో తెలియదు అంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగు సినిమా స్థాయిని అమాంతం పెంచింది అనడంలో సందేహం లేదు.వేద మరియు అతని భార్య కూతురు చేసిన విభిన్నమైన పోరాటం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది అంటూ మేకర్స్ హామీ ఇస్తున్నారు.

మాస్ ఎలిమెట్స్ కారణంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.శివరాజ్ కుమార్ తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాల కోసం హైదరాబాద్ లో సందడి చేయబోతున్నారు.కాస్త జాగ్రత్తగా సినిమా ను ప్రమోట్ చేసి విడుదల చేస్తే ఈ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా గత సంవత్సరం విడుదలైన కన్నడ సినిమాల మాదిరిగా మంచి విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెద్దగా పోటీ లేని సమయంలో రాబోతున్న వేద సినిమా ఎంత మేరకు వసూళ్లు రాబట్టేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube