హీరో సూర్యకి ఆస్కార్ ఇవ్వాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన కన్నడ స్టార్..!

ఒక స్టార్ హీరోని మరో స్టార్ హీరో పొగడటం అంటే చాలా గొప్ప విషయం.అదికూడా ఒక భాషలో స్టార్ హీరో మరొక భాషలోని స్టార్ హీరోని పొగడటం చాలా అరుదు.

 Kannada Star Sudeep Praises Kollywood Star Surya-TeluguStop.com

అలాంటి ఓ సంఘటన జరిగింది.ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో సుదీప్ కోలీవుడ్ స్టార్ హీరో విలక్షణ నటుడు సూర్య గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

ఆయన నటించిన సినిమాలన్ని చూస్తానని చెప్పిన సుదీప్ ప్రత్యేకంగా సూరరై పొట్రు సినిమా బాగా నచ్చేసిందని ఆ సినిమాలో సూర్య నటన అద్భుతం అంటున్నారు సుదీప్.అంతేకాదు సినిమాలో సూర్య నటనకు ఆస్కార్ ఇచ్చిన తప్పులేదని చెప్పారు.

 Kannada Star Sudeep Praises Kollywood Star Surya-హీరో సూర్యకి ఆస్కార్ ఇవ్వాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన కన్నడ స్టార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సూర్య నటనకు సుదీప్ ఫిదా అయినట్టు చెప్పారు.సుధ కొంగర డైరక్షన్ లో వచ్చిన సూరరై పొట్రు సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో రిలీజైంది.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.ఆ సినిమాలో సూర్య నటన అందరిని మెప్పించింది.సినిమా గురించి సూర్య నటన గురించి సుదీప్ ప్రత్యేకంగా సూర్యని ప్రశంసించడం విశేషం.సుదీప్ తెలుగులో విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ వస్తున్నారు.

కన్నడలో తానొక స్టార్ హీరో అయినా సుదీప్ తెలుగులో మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తా అంటున్నారు.

#Sudeep #Surarai Potru #SuryaSurarai #Sudha Kongara #Kollywood Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు