హైదరాబాద్ లో ఖరీదైన విల్లా కొన్న సుదీప్.. ఎంతంటే..?

స్టార్ హీరో సుదీప్ శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం వరుస అవకాశాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.కన్నడలో స్టార్ హీరో అయినప్పటికీ మంచి పాత్రలు వస్తే ఇతర ఇండస్ట్రీల సినిమాల్లో నటించడానికి సుదీప్ వెనుకాడటం లేదు.

 Kananda Actor Kichcha Sudeep Bought Villa In Gachibowli, Gachibowli, Hyderabad,-TeluguStop.com

ఈ స్టార్ హీరో తాజాగా హైదరాబాద్ నగరంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్లు అని నగరంలో ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో సుదీప్ విల్లాను కొనుగోలు చేశాడని సమాచారం.

కన్నడ ఇండస్ట్రీ సినిమాలలో మెజారిటీ సినిమాలు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి.గత కొన్ని నెలలుగా సుదీప్ హైదరాబాద్ లోనే షూటింగ్ ల నిమిత్తం ఉంటున్నారు.

హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి స్టార్ హోటల్ లో బస చేయడం కంటే సొంతంగా విల్లా ఉంటే బాగుంటుందని భావించి సుదీప్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.సుదీప్ విల్లా కొనుగోలు చేయడానికి తెలుగులో వస్తున్న ఆఫర్లు కూడా కారణమని తెలుస్తోంది.

ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన రక్తచరిత్ర సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన సుదీప్ ఈగ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమాలో విలన్ పాత్రలో సుదీప్ నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

బాహుబలి పార్ట్ 1లో చిన్న పాత్రలో కనిపించిన సుదీప్ సైరా నరసింహారెడ్డి సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు.వరుసగా ఆఫర్లు వస్తున్నా సుదీప్ మాత్రం పేరు తెచ్చిపెట్టే పాత్రలనే ఎంచుకుంటున్నారు.

తెలుగులో స్టార్ హీరోలతో ఉండే సుదీప్ నటుడిగానే కాక రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.సుదీప్ కన్నడంలో నటించిన సినిమాలలో తెలుగులో డబ్ అయ్యి విడుదలైనా ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube