టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న మరో కన్నడ స్టార్- Kannada Star Hero Darshan Focus On Tollywood Market

Kannada Star Hero Darshan Focus On Tollywood Market, Tollywood, Sandalwood, KGF2, Hero Yash, Roberrt Movie,Kannada Star Hero Darshan - Telugu Hero Yash, Kannada Star Hero Darshan, Kannada Star Hero Darshan Focus On Tollywood Market, Kgf2, Roberrt Movie, Sandalwood, Tollywood, Tollywood Market

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాల మీద ద్రుష్టి పెట్టారు.ఇండియన్ సినిమా మార్కెట్ ని ఎంతో కొంత వరకు తెచ్చుకోవాలని యూనివర్శల్ కాన్సెప్ట్ లతో బాలీవుడ్ క్యాస్టింగ్ ని కూడా తీసుకొని సినిమాలు చేస్తున్నారు.

 Kannada Star Hero Darshan Focus On Tollywood Market-TeluguStop.com

ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా వైడ్ గా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.ఇప్పుడు అదే పనిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్, అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి స్టార్స్ దృష్టిపెట్టారు.

వీరు పాన్ ఇండియా కథలతోనే సినిమాలు చేస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ అయితే బాలీవుడ్ లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చి తరువాత పాన్ ఇండియా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.

 Kannada Star Hero Darshan Focus On Tollywood Market-టాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న మరో కన్నడ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిందీలో కూడా మన తెలుగు సినిమాల విషయంపై ఒకప్పటి అభిప్రాయం లేదు.ఈ కారణంగా తెలుగులో చిన్న సినిమాలు కూడా ఎక్కువగా హిందీలోకి రీమేక్ అవుతున్నాయి.

అలాగే బాహుబలి, సాహూ తర్వాత తెలుగు సినిమాలని అక్కడ ఆదరిస్తున్నారు.ఈ కారణంగా మన తెలుగు హీరోలు మార్కెట్ ని పెంచుకోవడానికి పాన్ ఇండియా కథలని ఎంచుకున్నారు.

అయితే కన్నడ ఇండస్ట్రీ అంటే చాలా తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తారనే అభిప్రాయం ఉండేది.అక్కడ సినిమా మార్కెట్ తక్కువగా ఉండటంతో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇరవై కోట్లకి మించి బడ్జెట్ ఉండేవి కాదు.

అలాంటిది కేజీఎఫ్ సినిమాని ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో మొదటి సారి తెరకెక్కించి రికార్డ్ సృష్టించారు.ఈ సినిమా ఒక కన్నడ బాషలోనే వంద కోట్లు వసూళ్లు సాధించింది.

ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో అక్కడ మిగిలిన స్టార్ హీరోలు, అలాగే నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.కేజీఎఫ్ తర్వాత స్టార్ హీరో దర్శన కురుక్షేత్ర సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.దానిని పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేశారు.

దాంతో దర్శన్ కొంత వరకు బయట మార్కెట్ పెంచుకున్నాడు.ఇప్పుడు మరో రాబర్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ్, మలయాళీ బాషలలో కూడా రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా ద్వారా తెలుగు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలని దర్శన్ భావిస్తున్నాడు.

#Hero Yash #Sandalwood #KannadaStar #KGF2 #KannadaStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు