అత్తింటి వేధింపులుకి ప్రముఖ గాయని బలి  

Kannada Singer Commit Suicide - Telugu Commit Suicide, Dowry Harassment, Kannada Films, Kannada Singer

సమాజంలో ఆడ, మగ మధ్య స్థితి గతులు మారుతున్న, అంతరం తగ్గుతున్న వరకట్న వేధింపులు మాత్రం ఇప్పటికి కొనసాగుతున్నాయి.ప్రతి సంవత్సరం అత్తింటి వరకట్న వేధింపులకి ఎంతో మంది అబలలు బలైపోతున్నారు.

Kannada Singer Commit Suicide - Telugu Commit Suicide, Dowry Harassment, Kannada Films, Kannada Singer-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఈ వేధింపులు ఉన్నత కుటుంబాలు, ప్రముఖులకి కూడా తప్పడం లేదు.బయటి ప్రపంచంలో ఎంత హోదాలో ఉన్న కూడా అత్తింటి వారి ఆధిపత్యం, వేధింపులు మాత్రం చాలా మంది మహిళలకి ఉన్నాయి.

తాజాగా ఓ ప్రముఖ గాయని వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది.

కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాలు, సీరియల్స్ కి పాటలు పాడుతూ గాయకురాలిగా రాణిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సుస్మిత ఆత్మహత్య చేసుకుంది.

శరత్ అనే యువకుడితో సుస్మితకు ఏడాది క్రితం ప్రేమించే పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయిన నాటి నుంచి వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి.దాంతో ఆమె భర్త నుంచి విడిపోయి బెంగళూరులోనే తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.అయిన కూడా ఆమెని తరుచు భర్త, అత్తింటి వారు వేధింపులకి గురి చేస్తూ ఉన్నారు.

ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సూసైడ్ నోట్ రాసిన సుస్మిత దాన్ని తన తల్లికి వాట్సాప్ ద్వారా పంపింది.

శరత్ ను, అతని తరఫు వాళ్లను ఎవరినీ వదలొద్దని పేర్కొంది.అత్తవారింట చనిపోవడం కంటే తాను పుట్టిపెరిగిన ఇంట్లోనే చనిపోవాలని భావించానని సుస్మిత అందులో రాసింది.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు, సుస్మిత భర్త, అత్త మామల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజా వార్తలు

Kannada Singer Commit Suicide-dowry Harassment,kannada Films,kannada Singer Related....