కన్నడ పవర్ స్టార్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ

కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అనే ఇమేజ్ తో గుర్తింపు పెంచుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు పునీత్ రాజ్ కుమార్.ఈ యంగ్ హీరో తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేకపోయిన కన్నడంలో మంచి కమర్షియల్ హీరో.

 Kannada Power Star Puneeth Rajkumar Entry In Tollywood, Prakash Raj, Hombale Fil-TeluguStop.com

కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.స్వతహాగా మంచి డాన్సర్ కూడా కావడంతో పునీత్ రాజ్ కుమార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇతనితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా నిర్మాతలు భావిస్తారు.ఎక్కువ లవ్ స్టొరీలు చేసి, తరువాత కమర్షియల్ హీరోయిక్ కథలపై దృష్టి పెట్టిన పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం యువరత్న అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాని కేజీఎఫ్ మేకర్స్ నిర్మిస్తూ ఉండటంతో దీనిని వారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.కోలీవుడ్ హీరోల తరహాలోనే కన్నడ హీరోలు కూడా తెలుగు మార్కెట్ మీద కేజీఎఫ్ తర్వాత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ లకి టాలీవుడ్ లో కొంత ఇమేజ్ ఉంది.ఇప్పుడు యష్ కూడా కేజీఎఫ్ తో ఇమేజ్ పెంచుకున్నాడు.

రీసెంట్ గా దర్శన్ రాబర్ట్ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి వచ్చాడు.అయితే ఆ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమాతో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.కాలేజీ బ్యాక్ డ్రాప్ లో విద్యా వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపిస్తూ స్టూడెంట్స్ ని రౌడీలు ఎలా ప్రభావితం చేస్తున్నారు అనే అంశాలని ఈ సినిమాలో దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్ చూపిస్తున్నాడు.

ఏప్రిల్ ఒకటిన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.టీజర్ కాస్తా ఇంటెన్సిటీతోనే ఉంది.

ప్రకాష్ రాజ్, సాయేషా సైగల్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తూ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.గతంలో పునీత్ నటించిన కొన్ని కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయిన యువరత్న మాత్రం ఒకేసారి కన్నడ, తెలుగు బాషలలో రిలీజ్ అవుతూ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube