బుచ్చిబాబు 'పుష్ప' కామెంట్స్ పై కేజీఎఫ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్‌

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా గురించి ఇటీవల ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ కేజీఎఫ్‌ సినిమా తో పోల్చాడు.ఇప్పుడు అది వివాదాన్ని రేపుతోంది.

 Kannada Netizens Trolls On Uppenda Director Buchi Babu-TeluguStop.com

ఆయన తన గురువు సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో పుష్ప సినిమా ను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశాడు.ఆ సమయంలో పుష్ప లోని యాక్షన్‌ సన్నివేశాలు అద్బుతం అన్నాడు.

నేను సినిమా ను చూశాను ఇది ఖచ్చితంగా 10 కేజీఎఫ్‌ లకు సమానం. కేజీఎఫ్‌ యాక్షన్‌ సన్నివేశాలు పుష్ప ముందు దిగదుడుపే అన్నట్లుగా బుచ్చి బాబు వ్యాఖ్యలు చేశాడు.

 Kannada Netizens Trolls On Uppenda Director Buchi Babu-బుచ్చిబాబు పుష్ప’ కామెంట్స్ పై కేజీఎఫ్‌ ఫ్యాన్స్ ట్రోల్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుచ్చి బాబు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి.పలు ఇంగ్లీష్ మీడియా సంస్థలు ఈ కథనంను ప్రచురితం చేయడం వల్ల కన్నడ సినీ అభిమానులు ఫీల్‌ అవుతున్నారు.

పుష్ప సినిమా బాగుంటుంది అంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదు.కాని పుష్ప సినిమా 10 కేజీఎఫ్‌ లతో సమానం అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కాస్త అతి అంటూ కన్నడ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

కన్నడ నెటిజన్స్‌ బుచ్చి బాబు వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ కేజీఎఫ్‌ సినిమా కంటే 10 రెట్లు ఉంటే కేజీఎఫ్‌ వసూళ్లు చేసిన మొత్తంకు 10 రెట్లు వసూళ్లు చేయాలి.మరి ఆ సత్తా మీ పుష్పకు ఉందా అంటూ బుచ్చి బాబును ప్రశ్నిస్తున్నారు.

కన్నడ నెటిజన్స్‌ బుచ్చి బాబును అనేక రకాలుగా ట్రోల్‌ చేస్తున్నాడు.

Telugu Allu Arjun Pushpa, Buchi Babu, Buchi Babu Comments, Buchibabu Troll, Film News, Kannada Industry, Kgf 2, Kgf Movie, Netizens, Pushpa-Movie

తెలుగు వ్యక్తి అయిన బుచ్చి బాబుకు కన్నడ కేజీఎఫ్ అర్థం కాలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి బుచ్చి బాబును నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.ప్రస్తుతం నెట్టింట ఆ విషయం చర్చ జరుగుతోంది.

కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల కాబోతున్న ఈ సమయంలో బుచ్చి బాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కన్నడ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు అంతా కూడా పుష్ప సినిమా విషయమై అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వివాదం ఎక్కడకు వెళ్తుందో చూడాలి.

#BuchiBabu #KGF 2 #Buchi Babu #Buchibabu Troll #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు