ఇది రష్మిక మందన్నా రేంజ్‌.. కనిపిస్తే రూ.4 కోట్లు  

this is rashmika range...4 crores for just appearing, kannada movie pogaru releasing in telugu with big amount, pogaru, pogaru dubbing, rashmika in pogaru - Telugu Druv Sarja, Kannada Movie In Telugu, Pogaru, Pogaru Dubbing, Pushpa Heroine, Rashmika In Pogaru, Rashmika Mandanna

కన్నడ హీరో ధృవ్‌ సర్జ తెలుగులో ఏ ఒక్కరికి తెలియదు.ఈమద్య కాలంలో ఇతర భాషల హీరోలు పరిచయం ఉన్నా కూడా వారి సినిమాలు తెలుగు లో విడుదల కావడం గగనంగా మారింది.

TeluguStop.com - Kannada Movie Pogaru Releasing In Telugu With Big Amount

అలాంటిది ఈ హీరో పేరు పెద్దగా తెలియనే లేదు.అయినా కూడా ఆయన నటించిన ‘పొగరు’ సినిమా తెలుగులో డబ్ అయ్యేందుకు సిద్దం అయ్యింది.

కన్నడంలో భారీ అంచనాలు ఉన్నంత మాత్రాన సినిమాకు తెలుగులో మంచి బిజినెస్‌ అవ్వాలని లేదు.ఎందుకంటే ధృవ్‌ కు ఇక్కడ మార్కెట్‌ లేదు.

TeluguStop.com - ఇది రష్మిక మందన్నా రేంజ్‌.. కనిపిస్తే రూ.4 కోట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినా కూడా ఆయన నటించిన పొగరు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నాలుగు కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసేందుకు బయ్యర్లు సిద్దం అయ్యారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఒకరు తెలుగు రైట్స్ తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ విషయం చాలా హాట్ టాపిక్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు.

ధృవ్ సినిమాకు అంత ఎందుకు పెట్టారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.సినిమాలో రష్మిక మందన్నా ఉండటం వల్లే సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ అయ్యింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.ప్రస్తుతం టాలీవుడ్ లో నెం.1 హీరోయిన్ గా దూకుడు మీదున్న రష్మిక మందన్నా నటించిన సినిమా అవ్వడంతో డబ్బింగ్‌ చేయాలని భావిస్తున్నారు.పైగా పొగరు సినిమాలోని పాటలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి.కనుక భారీ ఎత్తున అంచనాలున్న కన్నడ మూవీ పొగరును తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండానే తీసుకు వస్తున్నారు.

ఈ విషయంలో రష్మిక నిర్మాతలకు ఎంతగా ఉపయోగం చేస్తుందో చూడాలి.ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు నాని సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

హిందీ మరియు తమిళ సినిమాల్లో కూడా ఈమె వరుసగా నటిస్తోంది.

#Pogaru Dubbing #Pogaru #Druv Sarja #KannadaMovie #Pushpa Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు