ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని గుడికి వెళుతుంటే మధ్యలోనే ప్రమాదం జరిగి...  

తెలుగులో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటించిన “అల్లరి పోలీస్” చిత్రంలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ “మాలశ్రీ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటి మాలశ్రీ కన్నడ భాషకి చెందినప్పటికీ ఆమె కన్నడతో పాటూ తెలుగు, తమిళం, తదితర భాషలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Kannada Heroine Malashri Marriage And Accident News

కానీ రానురాను ఆమె మాతృభాష కన్నడలో సినీ అవకాశాలు ఎక్కువగా రావడంతో ఇతర భాష చిత్రాలపైపెద్దగా దృష్టి సారించలేక పోయింది.

అయితే తాజాగా నటి మాలశ్రీ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని గుడికి వెళుతుంటే మధ్యలోనే ప్రమాదం జరిగి…-Gossips-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోతో నటి మాలశ్రీ ప్రేమలో పడిందని, అంతేగాక వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి దేవాలయానికి వెళుతున్న సమయంలో కారు ప్రమాదానికి గురై తన ప్రియుడు మరణించాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అందువల్లే  నటి మాలశ్రీ కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరం అయిందని కొందరు కనడ సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

 ఆ తర్వాత నెమ్మదిగా కుటుంబ సభ్యుల సహాయంతో కోలుకుని మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది.ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ నిర్మాత ని మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం నటి మాలశ్రీ కి ఒక పాప ఉంది.

అయితే అప్పట్లో నటి మాలశ్రీ  తెలుగులో మంచి విజయం సాధించిన “చంటి” చిత్ర కన్నడ రీమేక్ లో మీనా పాత్రలో నటించింది. దీంతో నటి మాలశ్రీ కి పలు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా వరించాయి.ఈ మధ్య కాలంలో నటి మాలశ్రీ ఎక్కువగా కన్నడలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల పై దృష్టి సారించింది.

కాగా ప్రస్తుతం కన్నడలో తన పేరు మీదుగా తెరకెక్కుతున్న చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.

#Kannada Heroine #Sandalwood #Malashri #AllariPolice #KannadaHeroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు