Haripriy vasishta simha : సోషల్ మీడియా వార్తలు నిజం చేసిన హీరోయిన్.. ప్రియుడిని పరిచయం చేసేసిందిగా!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నారు అంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుంది అంటూ గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఎన్నో రకాల వార్తలను సృష్టిస్తూ ఉంటారు.అయితే ఆ జంట ప్రవర్తన కూడా అందుకు ఆజ్యం పోసినట్టుగా ఉండడంతో ఇక వారు డేటింగ్ లో ఉన్నారు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ కూడా వార్తలు రాసిస్తూ ఉంటారు.

 Kannada Heroine Haripriy Engagement Vasishta Simha Haripriya, Engegement, Vasis-TeluguStop.com

అయితే ఇలా సోషల్ మీడియాలో రూమర్స్ ని నిజం చేస్తూ చాలా సెలబ్రిటీ జంటలు ఒకటైన విషయం తెలిసిందే.మొదట్లో ఆ విషయాన్ని దాస్తూ డేటింగ్ లో ఉన్నప్పటికీ అదే విషయాన్ని తర్వాత అధికారికంగా ప్రకటిస్తూ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటలు ఎన్నో ఉన్నాయి.

తాజాగా కూడా ఒక జంట అదేవిధంగా దగ్గర అయింది.కోలీవుడ్ లో నటుడు వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ డేటింగ్‌ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ జంట అప్పుడప్పుడు కలిసి కనిపించడంతో ఆ వార్తలు నిజమే అని నమ్మారు.ఇక తాజాగా కూడా ఈ జంట దుబాయ్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తూ ఎయిర్పోర్టులో మీడియాకు కనిపించడంతో వారిద్దరి ప్రేమ డేటింగ్ విషయం నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఇక తొందర్లోనే ఈ జంట మూడుముళ్ల బంధం ఒక్కటి కాబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ జంట సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది.ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు ఒకటి కాబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయాలపై స్పందించని ఈ జంట ఒకసారిగా ఊహించిన విధంగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ వార్తలన్ని నిజమే అని తేల్చి చెప్పేసింది.

వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వశిష్ట, హరిప్రియ ఇద్దరు ఒక సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు.

తొలి చూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారింది.కాగా హరిప్రియ కన్నడలో ఉగ్రమ్‌, రన్న, రికీ, నీర్‌ దోసె, భర్జరి, సంహారా, లైఫ్‌ జోతే ఓంద్‌ సెల్ఫీ, బెల్‌ బాటమ్‌ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube