రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కేజియఫ్ చాప్టర్ 2.... పండగ చేసుకోండి...

2018 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ప్రశాంతి నీల్ దర్శకత్వం వహించినటువంటి కన్నడ చిత్రం కేజియఫ్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ వసూళ్లను కొల్లగొట్టింది.ఈ చిత్రం ఒక కన్నడ లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళంలో కూడా విజయకేతనం ఎగురవేసింది.

 Kannada Hero Yash Kgf Chapter 2 Movie Release Fix-TeluguStop.com

అయితే అప్పటి నుంచి ఈ చిత్రం రెండవ భాగం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి కన్నడ స్టార్ హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

అంతేగాక పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే అవకాశం కూడా తగ్గించుకున్నాడు.

అయితే ప్రస్తుతం భారీ అంచనాల నడుమ తెరికెక్కుతున్న కేజియఫ్ చాప్టర్ – 2 విడుదల తేదీని చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా ఖరారు చేశారు.

అంతేకాక ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేస్తూ అక్టోబర్ 23 వ తారీఖున కేజియఫ్ చాప్టర్ – 2 విడుదల చేస్తున్నట్లు తెలిపారు.దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మొదటి చాప్టర్లో రాఖీ బాయ్ గా అలరించినటువంటి హీరో యష్ రెండో భాగంలో అండర్ వరల్డ్ గోల్డ్ మైనింగ్ డాన్ గా కనిపిస్తున్నట్లు సమాచారం.అయితే తాజాగా విడుదల చేసినటువంటి ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Telugu Indian Yash, Kannadayash, Sanjay Dutt, Sanjay Dutt Kgf-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం.అందువల్లనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.దీంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.మరి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టినటువంటి కేజియఫ్ చాప్టర్ – 1,  చాప్టర్ – 2 చెట్టు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube