ప్రశాంత్ నీల్‌పై మండిపడుతున్న ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా?  

Kannada Fans Angry On Prashanth Neel - Telugu Kannada Fans, Kgf, Ntr, Ntr31, Prashanth Neel

కన్నడ హీరో యశ్‌ను ఒకే ఒక్క చిత్రంతో నేషనల్ హీరోగా నిలబెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.‘కేజీఎఫ్’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించి అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు ఈ డైరెక్టర్.

 Kannada Fans Angry On Prashanth Neel

సినిమాలో కేవలం మాస్ కంటెంట్‌తో కూడా రికార్డులు క్రియేట్ చేయవచ్చని నిరూపించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా పూర్తవ్వగానే తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్.

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మాస్‌లో ఉన్న క్రేజ్‌ను చూసి ఆయనతో తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు.ఈ క్రమంలో తన నెక్ట్స్ కథకు హీరో దొరికేశాడంటూ చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్.

ప్రశాంత్ నీల్‌పై మండిపడుతున్న ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పుడు ఇదే ఆయనకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతోంది.కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్, ఇతర భాష హీరోతో సినిమా చేయడం అక్కడి ప్రేక్షకులకు మింగుడు పడలేదు.

తమ హీరో యశ్ ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంటున్నాడని, ఈ జాబితాలో మరో హీరో యాడ్ కావడం తమకు ఇష్టం లేదని కన్నడ అభిమానులు మండిపడుతున్నారు.

దీంతో వారు ప్రశాంత్ నీల్‌ను తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇతర భాష స్టార్ డైరెక్టర్స్ వేరే హీరోలతో సినిమాలు చేయడం లేదని, వారికి లేనిది ప్రశాంత్ నీల్‌కు మాత్రం ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శంకర్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ తమ భాష హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నారని, తనకు ఇలాంటి పట్టింపులు లేకపోతే కన్నడ నుండి వెళ్లిపోయి వేరే హీరోలతో సినిమాలు చేసుకోవాలంటూ వారు మండిపడుతున్నారు.

దీంతో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు