కరోనా వైరస్ పై సినిమా... కరోనా ని ఇలా కూడా వదలరా...

ఎక్కడో చైనాలో పుట్టి వందల సంఖ్యలో జనాలని బలి తీసుకున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో మాత్రం తన ప్రతాపాన్ని చూపించలేక పోతోంది.ఎలాగంటే ఇప్పటివరకు భారతదేశంలో స్వతహాగా కరోనా వైరస్ సోకినటువంటి వాళ్ళు ఎవరూ లేరు.

 Kannada Director Umesh Banakar Is Takeover Coronavirus Movie-TeluguStop.com

ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కరోనా లక్షణాలతో బాధ పడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారే ఎక్కువ.అయితే ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కి మందు కనిపెట్టే పనిలో ఉంటే మాత్రం మనవాళ్ళు మాత్రం కరోనా వైరస్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ మధ్యనే ఈ కరోనా  వైరస్ గురించి సినిమా కూడా తీయాలని కొందరు అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం కన్నడ ప్రముఖ దర్శకుడు ఉమేష్ భణకర్ ఈ కరోనా వైరస్ గురించి సినిమా తీయడానికి ఇప్పటికే కథలు కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక ఈ చిత్రానికి “డెడ్లీ కరోనా” అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం.అంతేగాక ఈ చిత్రాన్ని భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి అన్ని భాషలలో అనువతిస్తూ తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.

మాములుగా క్రేజ్ ని ఉపయోగించుకొని క్యాష్ చేసుకోవడంలో భారతీయులకి మించిన వారు మరొకరు ఉండరు.అంతే గాక ప్రస్తుతం కరోనా వైరస్ గురించి బ్రిటన్, ఉత్తర కొరియా, అమెరికా, చైనా వంటి దేశాలు తీవ్రంగా భయపడుతుంటే మన వాళ్లు మాత్రం సిల్లిగా తీసి పడేస్తున్నారు.

Telugu Coronavirus, Umesh Banakar, Kannadaumesh, Umeshbanakar-Movie

ఈ కరోనా వైరస్ గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినటువంటి పలు వ్యాఖ్యలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ ఈ మధ్యనే తనకు ఓ ప్రముఖ సైంటిస్ట్ ఫోన్ చేశారని ఈ కరోనా వైరస్ గురించి పలు అంశాలు తనతో చెప్పాడని మరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.అంతేగాక ప్రపంచంలో ఎక్కడ కరోనా వైరస్ రావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ రాదని ఎందుకంటే 22 డిగ్రీల ఉష్ణోగ్రత వేడి కంటే ఎక్కువ ఉంటే కరోనా వైరస్ బ్రతకదని సెకను కాలంలోనే చనిపోతుందని, ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా 30డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం నెటిజన్లను బాగానే ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube