ప్రేక్షకులకు భారీ ఝలక్.. బిగ్ బాస్ షో క్యాన్సిల్..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆగష్టు నెల నుంచి ప్రసారమవుతుందని ప్రచారం జరుగుతుండగా కన్నడ బిగ్ బాస్ షో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆగిపోయింది.

 Kannada Bigg Boss Season 8 Stopped Mid Way-TeluguStop.com

కరోనా, లాక్ డౌన్ వల్ల బిగ్ బాస్ షో సీజన్ 8 క్యాన్సిల్ అయింది.ఈ విషయం తెలిసి ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లు సైతం షాక్ అయ్యారు.

ప్రతి సీజన్ లాగే బిగ్ బాస్ సీజన్ 8 సైతం ఎంతో ఉత్కంఠతో కొనసాగుతుండగా ఈ షోపై కరోనా వైరస్ ప్రభావం పడింది.కరోనా వల్ల బిగ్ బాస్ సీజన్ 8 కన్నడలో ఆలస్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైంది.

 Kannada Bigg Boss Season 8 Stopped Mid Way-ప్రేక్షకులకు భారీ ఝలక్.. బిగ్ బాస్ షో క్యాన్సిల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా రూల్స్ అమలవుతున్న తరుణంలో ప్రేక్షకులను ఈ షో ఎంతగానో ఆకట్టుకుంది.కర్ణాటక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ఆ ప్రభావం పరోక్షంగా బిగ్ బాస్ షోపై కూడా పడటం గమనార్హం.

Telugu Bigg Boss 8, Kannada Bigg Boss, Stopped Mid Way, Why Because-Movie

కన్నడలో కిచ్చా సుదీప్ అనారోగ్య సమస్యల వల్ల కొన్నిరోజులు ఈ షోకు హాజరు కాలేదు.అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో బిగ్ బాస్ నిర్వాహకులు షోను అర్ధాంతరంగా ఆపేసి కంటెస్టెంట్లను ఇంటి నుంచి బయటకు పంపించారు.100 రోజుల షో 71వ రోజునే ఆగిపోయింది.,/br>

కలర్స్ ఛానల్ లో ఈ షో ప్రసారమవుండగా 8 మంది కంటెస్టెంట్లు ఉండగా విన్నర్, రన్నర్ ను ప్రకటించకుండానే షో ఆగిపోయింది.అయితే మరికొన్ని రోజుల తర్వాత షో విజేతను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ట్రోఫీ లేకుండానే బిగ్ బాస్ షోకు ముగింపు పలకడం గమనార్హం.

#Stopped Mid Way #Bigg Boss 8 #Why Because

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు