డ్రగ్స్ కేసులో విచారణ.. స్పందించిన కన్నడ యాంకర్ అనుశ్రీ..!  

Kannada Anchor Anusree Responds on Drugs case, Drugs case, Kannada, anchor, Anusree - Telugu Anchor, Anusree, Drugs Case, Kannada, Kannada Anchor Anusree Responds On Drugs Case, Responds

డ్రగ్స్ కేసులో కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని సీసీబీ అధికారులు విచారణ జరిపేందుకు నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు సీసీబీ నోటీసులివ్వడంతో యాంకర్ అనుశ్రీ స్పందించింది.

TeluguStop.com - Kannada Anchor Anusree Drugs Probe Case

శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన డాన్సర్ కిశోర్ రెడ్డిని సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.కిశోర్ రెడ్డిని విచారణ జరపడంతో టీవీ యాంకర్ అనుశ్రీకి కూడా సంబంధాలు ఉన్నాయని తేలింది.

దీంతో సీసీబీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.కిశోర్ రెడ్డికి బెంగళూరు నుంచి గోవా, మంగళురు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్న సీసీబీ అధికారులు ముఠాను గుర్తించి అరెస్ట్ చేశారు.

TeluguStop.com - డ్రగ్స్ కేసులో విచారణ.. స్పందించిన కన్నడ యాంకర్ అనుశ్రీ..-General-Telugu-Telugu Tollywood Photo Image

కాగా, ముఠా నాయకుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీసీబీ అధికారులు తెలిపారు.ఈ ముఠా నాయకుడికి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.

ఈ మేరకు డ్రగ్స్ కేసులో విచారణకు యాంకర్ అనుశ్రీ స్పందించారు.విచారణలో యాంకర్ అనుశ్రీ మాట్లాడుతూ.కిశోర్ శెట్టి అనే వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.సినిమాల్లో నటించేటప్పుడు పదేళ్ల క్రితం అతడితో కలిసి డ్యాన్స్ చేశానన్నారు.

అంతకు మించి అతడితో ఎలాంటి పరిచయం లేదన్నారు.అనంతరం కిశోర్ రెడ్డిని విచారణ జరిపినప్పుడు బెంగళూరులోని కాలేజీలకు కార్తీక్ శెట్టి అనే వ్యక్తితో కిశోర్ శెట్టి డ్రగ్స్ సరఫరా చేసేవాడని, విచారణకు అతడిని బెంగళూరుకు తీసుకొస్తున్నట్లు సీసీబీ అధికారులు వెల్లడించారు.కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీ ఎన్నో సినిమాలు, టీవీ సీరియళ్లు చేశారు.2005వ సంవత్సరంలో ‘టెలి అంతాక్షరి’ పోగ్రామ్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.స్టాల్ లైవ్, సూపర్ (సీజన్-1, 2), సరిగమప వంటి పాఫులర్ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు.ప్రస్తుతం సరిగమప సీజన్-17 యాంకర్ గా కొనసాగుతున్నారు.

#KannadaAnchor #Kannada #Anusree #Responds #Drugs Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kannada Anchor Anusree Drugs Probe Case Related Telugu News,Photos/Pics,Images..