తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వారికి ఎలా అయితే అవకాశాలు దొక్కడం లేదో సీరియల్ ఇండస్ట్రీలో కూడా దాదాపు ఇంచుమించు అదే పరిస్థితి.ఒక్క తెలుగు అమ్మాయి కూడా సీరియల్స్ లో కనిపించదు.
పూర్తిగా కన్నడ రంగానికి చెందిన తారల( Kannada Actress ) హవానే కనిపిస్తూ ఉంటుంది.మన వారిని వారు ఎప్పుడో డామినేట్ చేసి పడేశారు.
ఇప్పుడు కొత్తగా తెలుగుకి అవకాశాలు దక్కాలని మనం మాట్లాడుకోవడంలో వృధా ప్రయాస తప్ప ఏమీ లేదు.కానీ వారికి కాస్త మెరిట్ అయితే దక్కుతుంది.
పైగా వారు మన తారలను తొక్కేయడానికి బాగా కష్టపడి పని చేస్తారు.అంతేకాదు భాషను కూడా నేర్చేసుకుంటున్నారు.

ఈ కోవలోనే ఇప్పుడు మరొక కన్నడ తార తెలుగు సినిమాల్లోకి ప్రవేశిస్తుంది.పైగా ఆమె ఒకప్పుడు మన తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడం విశేషం.ఆ తార మరెవరో కాదు… భూమిశెట్టి.( Bhoomi Shetty ) ఈమె హీరోయిన్ గా షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయం కాబోతోంది.
ఆమె గురించి మన యాంకర్లకి గాని సినిమా ప్రమోషన్ చేస్తున్న టీమ్స్ కి కానీ ఏమీ తెలియకపోవడం విశేషం.ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నకి హీరో చైతన్య కి ఏమి తెలియలేదు.
దాంతో ఆమె ఎవరో తెలుసుకోవాలని కుతూహలం మొదలై ఈ ఆర్టికల్ వేయడం జరుగుతోంది.భూమిశెట్టి మంగళూరులో పుట్టి పెరిగింది.ఇప్పటికే సీరియల్స్ రంగంలో శోభా శెట్టి ( Shobha Shetty ) వంటి వారు ఉన్నారు.సినిమా రంగంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, అనుష్క శెట్టి, శిల్పా శెట్టి ఉండనే ఉన్నారు.వీరంతా మంగలూరు వాసులే అని మనకు తెలియనిది కాదు

భరతనాట్యం, యక్షగానం కూడా భూమిశెట్టి నేర్చుకుందట.కన్నడ లో పాపులర్ సీరియల్స్ లో కూడా నటించింది ఈ అమ్మడు.బిగ్ బాస్ సీజన్ 7 లో( Bigg Boss 7 ) ఫోర్త్ ప్లేస్ దక్కించుకొని బాగానే ఫెమ్ సంపాదించింది.నిన్నే పెళ్ళాడుతా అనే ఒక తెలుగు సీరియల్ లో కూడా నటించింది ఈ భూమి.
సినిమా అవకాశాల కోసం చాలా రోజులుగా టీవీలో కనిపించకపోయేసరికి ఎవరు గుర్తుపట్టడం లేదు.హైదరాబాద్ కి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీకి లో సెటిల్ అవుతున్న చాలామంది తారలలో భూమి శెట్టి కూడా ఒకరు.
ఇక టీవీ సీరియల్స్ రంగం మాత్రమే కాదు యాంకరింగ్ రంగంలో కూడా కన్నడ వారి హవానే బాగా ఉంటుంది.ఈ మధ్య సౌమ్య రావు అనే ఒక అమ్మాయి బాగా పాపులర్ కూడా అయింది.
మరి భూమిశెట్టి కూడా ఏమాత్రం మన వారిపై ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.