ఏపీ బీజేపీలో అప్పుడే ఈ గొడవలేంటి ?  

Kanna Lakshminarayana Getting Eligations In Bjp-

ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కి అప్పుడే కొత్త తలపోట్లు మొదలయ్యాయి.ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారనే కారణంతో కొంతమంది అలక పాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది.దీనంతటికి కారణం కొద్ది రోజుల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులే అని తెలుస్తోంది.మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎక్కడలేని ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ అధిష్టానం కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం పాత నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Kanna Lakshminarayana Getting Eligations In Bjp- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Kanna Lakshminarayana Getting Eligations In Bjp--Kanna Lakshminarayana Getting Eligations In BJP-

అదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రాధాన్యతను తగ్గించడం వెనుక కారణాలు తెలియక ఆందోళన చెందుతున్నారు.

Kanna Lakshminarayana Getting Eligations In Bjp- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Kanna Lakshminarayana Getting Eligations In Bjp--Kanna Lakshminarayana Getting Eligations In BJP-

ఈ పరిణామాల నేపథ్యంలో అప్పుడే ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఏర్పడడం అనేక అనుమానాలను కలిగిస్తోంది.గతంలో కన్నా లక్ష్మి నారాయణ వైసీపీలో చేరబోయే ముందు మనసు మార్చుకుని బీజేపీలోకి వచ్చారు.అప్పట్లో ఆయన కు చాలా ఆఫర్లు ప్రకటించే పార్టీలోకి తీసుకొచ్చి అధ్యక్షుడిగా నియమించారు.ఆయన కూడా కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, తనకు ఏదో ఒక కీలక పదవి దక్కుతుందని భావించారు.

ఈ నేపథ్యంలో కన్నా రాజ్యసభ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.పార్టీ మారేటప్పుడు కూడా బీజేపీ నేత రామ్ మాధవ్ కన్నాకు ఎన్నో ఆశలు పెట్టారు.ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కన్నా పరిస్థితి గందరగోళంలో పడింది.

కన్నా వర్గంగా పేరుపడ్డ కొందరు ఇప్పుడు అధిష్టానం మీద రగిలిపోతున్నారు.రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే, పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు.

టీడీపీ నలుగురు ఎంపీల చేరికలపై కన్నాకు కనీస సమాచారం ఇవ్వడంలేదట.అంతేగాదు ఆ తర్వాత చాలా మందిని బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారి గురించి కన్నాతో కనీస చర్చలు కూడా జరపలేదు.అంతే కాదు ఏపీకి వస్తున్న జాతీయ నేతలు కూడా ఎక్కడా కన్నా పేరు ఎత్తకుండా సుజనా పేరును హైలెట్ చేయడం కన్నా వర్గానికి మింగుడుపడం లేదట.ఈ పరిణామాల కారణంగా పార్టీ తనను పక్కన పెట్టిందని భావిస్తున్న కన్నా లక్ష్మి నారాయణ ఆదివారం సుజనా చౌదరి ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉన్నప్పటికీ అసలు ఆ కార్యక్రమానికే హాజరవ్వకుండా తన నిరసనను తెలియజేశారు.