క‌న్నా వైసీపీ ఎంట్రీ బ్రేక్‌... బెదిరింపులు ప‌నిచేశాయా..!       2018-04-26   02:31:53  IST  Bhanu C

గ‌త రెండు మూడు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన పేరు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా ఆయ‌న పేరు వినిపించింది. ఆయ‌న త్వ‌ర‌లోనే ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్నార‌ని, ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గం కావ‌డంతో అది బాగా ప‌నిచేసింద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే, అనూహ్యంగా ఆయ‌నకు బీజేపీలో సీనియార్టీ లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ను బీజేపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. దీంతో అప్ప‌టికే తీవ్ర‌మైన ఆశ‌లు పెట్టుకున్న క‌న్నా.. ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయిన విష‌యం కూడా భారీ ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేసింది. దీనిని రాష్ట్ర బీజేపీ నేత‌లు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే, కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి ఈ విష‌యం తెలిసి.. చాలా సీరియ‌స్ అయింది.

వెంట‌నే లైన్‌లోకి వ‌చ్చిన బీజేపీ అధిష్టానం పెద్ద‌లు క‌న్నాతో చ‌ర్చించారు. పార్టీ మారొద్ద‌ని ఫ్యూచ‌ర్ చూపిస్తామ‌ని అన్నారు. వాస్త‌వానికి.. క‌న్నా.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోవ‌డం త‌న‌కు పెద‌కూర‌పాడు అసెంబ్లీ త‌న‌కు త‌న స‌న్నిహితుడు అయిన తేళ్ల వెంక‌టేశ్ యాద‌వ్‌కు చీరాల సీటు కూడా రిజ‌ర్వ్ చేసుకున్నారు. పార్టీలో చేరేందుకు బుధ‌వారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే, ఈ విష‌యం తెలిసిన బీజేపీ సీనియ‌ర్ అయిన క‌న్నాను పోగొట్టు కోవ‌డం ఇష్టం లేక ఒక‌ప‌క్క‌, క‌న్నా వెళ్లిపోతే.. కాపులు పార్టీకి దూర‌మ‌వుతార‌ని మ‌రోప‌క్క‌… బాగా ఆలోచించిన మీద‌ట క‌న్నాను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. బుధ‌వారం తెల్ల‌వారుతూనే క‌న్నాకు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వ‌చ్చింద‌ట‌.

పార్టీ మారొద్దు. మీకు స‌ముచిత స్థానం ఇస్తామ‌ని షా పేర్కొన్నార‌ట‌. అయితే. తాను ఇప్ప‌టికే పార్టీ మార్పుపై జ‌గ‌న్‌తో చ‌ర్చించాన‌ని, మీడియాలో నూ క‌థ‌నాలు వ‌చ్చేశాయని , కాబ‌ట్టి ఇప్పుడు కుద‌ర‌ద‌ని చెప్ప‌డంతో షా.. వెంట‌నే సీరియ‌స్ అయి.. దండోపాయం తెర‌మీద‌కి తెచ్చాడ‌ట‌. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ముఖ్యంగా ర‌వాణా మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో ఇచ్చిన అనుమ‌తుల‌కు సంబంధించి అవినీతి జ‌రిగిన‌ట్టు త‌మ‌కు ఆధారాలు ఉన్నాయ‌ని, ఆస్తులు కూడా బాగా పోగేశార‌ని, ఈ విష‌యంలో తాము క‌న్నెర్ర చేస్తే.. ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోవాల‌ని పేర్కొంటూ.. ఫోన్ కూడా పెట్టేశాడ‌ట‌. దీంతో చెమ‌ట‌లు ప‌ట్టిన క‌న్నా.. వెంట‌నే తానే షాకు ఫోన్ చేసి.. సారీ చెప్పార‌ని అప్పుడే వార్త‌లు లీక‌య్యాయి.

ఈ క్ర‌మంలోనే క‌న్నా కోరిన చోట వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌డంతోపాటు త‌న‌ను గెలిపించే బాధ్య‌త‌ను కూడా తీసుకుంటామ‌ని షా హామీ ఇచ్చాడ‌ట‌. కేంద్రంలో తిరిగి మోడీ ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని, అప్పుడు త‌ప్ప‌కుండా తాము ప్రాధాన్యం ఇస్తామ‌ని కూడా షా హామీ ల మీద హామీలు కుమ్మ‌రించాడ‌ట‌. దీంతో క‌న్నా.. సైలెంట్‌గా వెళ్లి ఆస్ప‌త్రి బెడ్‌పై ప‌వ‌ళించాడ‌ని క‌న్నాపై క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సో.. మొత్తానికి క‌న్నా.. వైసీపీ ఎంట్రీకి బ్రేక్ ప‌డింద‌న్న మాట‌. అదేస‌మ‌యంలోఆయ‌న‌కు షా నుంచి గ‌ట్టి హామీలు కూడా ల‌భించాయ‌ని అంటున్నారు. మ‌రి క‌న్నా అదృష్టం ఎలా ఉందో చూడాలి.