వెయ్యి కోట్ల స్కామ్ లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి ?

రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో మంచి డైలాగులు వేస్తూ విమర్శలు చేయడంలో ముందుంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలోనూ, జగన్ కంటే యాక్టివ్ గా స్పందిస్తూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ ఉంటారు.

 Kanna Lakshmi Narayana,vijayasai Reddy,aurobindo Pharmaeuticals,scam, Ys Jagan-TeluguStop.com

తన ఆడిటర్ తెలివితేటలను రాజకీయాల్లోనూ చూపిస్తూ, ప్రత్యర్థులకు నిత్యం సవాల్ విసురుతూ ఉంటారు.ఇదిలా ఉంటే అందరిపైన విమర్శలు చేస్తూ వస్తున్న విజయసాయి రెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కరోనా రాపిడ్ టెస్ట్ కిట్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో సంచలన ఆరోపణలు చేయగా, ఈ విషయంలో కేంద్ర బీజేపీ అధిష్టానం కలుగజేసుకుని ఇద్దరి మధ్య ఏ వివాదం లేకుండా చేసింది.

కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మరో పెద్ద స్కామ్ అంటూ ఓ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు.

108 వాహనాలకు కాంట్రాక్టు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆయన తెరపైకి తీసుకువచ్చారు.ఐదేళ్ల కాలంలో దాదాపు వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని విజయసాయి రెడ్డి అల్లుడు సాహా చేసేలా ఉత్తర్వులు ఇచ్చారని, దీని వెనుక పెద్ద తతంగమే నడుస్తోందని, దానిని బయట పెట్టాలంటూ విజయసాయిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.108 అంబులెన్స్ సేవలు ప్రస్తుతం నడుస్తున్నాయి.ప్రభుత్వం 2018లో బి ఏ జి అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు నెలకు లక్ష 31 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు ఉంటుంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బి ఏ జి సంస్థతో చేసుకున్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది.

వెంటనే అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు ఈ కాంట్రాక్టును కట్టబెట్టింది.

Telugu Scam, Vijayasai Reddy, Ys Jagan-Telugu Political News

అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు నెలకు 2.21 లక్షలు చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకుంది.కొత్తగా కొనుగోలు చేసే వాటికి 1.78 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.అంటే భారీగా సొమ్ములు గురించి అరవింద్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకున్నారు.

ఇలా ఒక్కో వాహనంపై నుంచి లక్షన్నర వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.అంటే ఐదు ఏళ్లలో దాదాపు వెయ్యి కోట్లు అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు జమ అవుతాయని కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఈ అరబిందో ఫార్మా ఫౌండేషన్ లో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉన్నారు అంటూ కన్నా చెబుతున్నారు.ఈ కాంట్రాక్టు పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పాత్రను కూడా నిగ్గు తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ మధ్య వార్ తీవ్రం అయ్యేలా కనిపిస్తోంది.ఈ విషయం లో విజయసాయి రెడ్డిని ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube