వైసీపీలోకి క‌న్నా.. నిజ‌మెంత..‌?

రాజ‌కీయాల్లో ఈ రోజు ఉన్న వాతావ‌ర‌ణం. రేపు ఉండ‌క‌పోవ‌చ్చు.

 Kanna Lakshmi Narayana Like To Join In Ysrcp?,kanna Lakshmi Narayana,join,bjp,ys-TeluguStop.com

ఎప్పుడు ఏం జ‌రిగినా.నాయ‌కులు స‌ర్దుకుపోవ‌డం లేదా.

త‌మ దారి తాము చూసుకోవ‌డం అనేది కామ‌న్‌గా మారిపోయింది.ఇప్పుడు ఇలాంటి సిట్యుయేష‌నే బీజేపీ మాజీ రాష్ట్ర సార‌థి.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కూడా వ‌చ్చింద‌నే వ్యాఖ్య‌లు వినిపి స్తున్నాయి.కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం చ‌క్రం తిప్పిన క‌న్నా.

త‌న కుమారుడికి కూడా మంచి లైఫ్ ఇచ్చు కునే రేంజ్‌కు ఎదిగారు.మంత్రి ప‌ద‌వులు కూడా చేప‌ట్టారు.

అయితే, రాష్ట్ర విభజనతో ఆయ‌నకు రాజ‌కీయంగా పెద్ద గ్యాప్ ఏర్ప‌డింది.ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ ఆఫ‌ర్ వ‌చ్చింది.

వెళ్లిపోదామ‌ని అనుకున్న స‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని చేసింది.దీంతో ఇక‌, పుంజుకుందామ‌ను కున్న క‌న్నాకు.ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం డ్రాబ్యాక్‌గా మారింది.అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకూడా బీజేపీలో నేత‌ల‌కు దూరం చేసింది ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ప‌క్క‌న పెట్టారు.

దీంతో ఆయ‌న‌కు జాతీయ పార్టీలో ప‌ద‌వులు ఇస్తార‌ని అందుకే త‌ప్పించార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.అయితే, జాతీయ పార్టీ క‌మిటీల్లోనూ క‌న్నాకు ప్రాధాన్యం ల‌భించ‌లేదు.

ఇక‌, రాష్ట్ర పార్టీలోనూ ఆయ‌న‌ను ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యారు.

Telugu Andhra Pradesh, Join, Somu Veera Raju, Ysrcp-Telugu Political News

దీంతో రాజ‌కీయంగా ప్రభ‌వం కోల్పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.ఇదిలావుంటే, గ‌డిచిన వారం రోజులుగా ఆయ‌న చూపు మ‌ళ్లీ వైసీపీవైపు ప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.ఇప్పుడున్న పొజిష‌న్‌లో ఆయ‌న‌కు వైసీపీనే క‌రెక్ట్ అని కొంద‌రు అంటున్నారు.

నిజానికి ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చి ఉంటే.ఎమ్మెల్యే అయి ఉండేవార‌ని, కుదిరితే కాపు కోటాలో మంత్రి పీఠం కూడా ద‌క్కి ఉండేద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

కానీ, ప‌క్కా అమ‌రావ‌తి ప్రేమికుడు అయిన క‌న్నా వైసీపీలోకి వెళ్తార‌నే వ్యాఖ్య‌లు నిజం కావ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.అయితే, ఆయ‌న కుమారుడు, గుంటూరు మాజీ మేయ‌ర్ మాత్రం వైసీపీలోకి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల ఆయ‌న గుంటూరులో వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి వ‌చ్చార‌నేది వాస్త‌వం.కానీ, రాజ‌కీయంగా కాద‌ని.ఆయ‌న స‌మాధానం చెప్పుకొన్నా.వైసీపీలోకి చేరేందుకు క‌న్నా కుమారుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు.

దీనికి వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి ప్రోత్సాహం ఉంద‌ని కూడా తెలుస్తోంది.మ‌రి కుమారుడు వెళ్తారా.

లేదా కుమారుడితో పాటు క‌న్నా కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా? అనేది చూడాలి.ఏదేమైనా.

పార్టీ మార్పు ఖాయ‌మేన‌ని తెలుస్తోంది.ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube