వైరల్ వీడియో: కన్న బిడ్డ కోసం ఏకంగా విషసర్పాన్నే ఎదురుకున్న ఎలుక..!  

భూగోళం మీద ఎన్నో రకాల జీవరాశులతో కలిసి మానవుడు జీవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఒక్కొక్క జీవిది ఒక్కో రకమైన జీవనం.

TeluguStop.com - Kanna Is The Rat Who Faced The Poisonous Snake In Unison For The Baby

మనిషి జీవనాన్ని కొనసాగించేందుకు మూడు పూటలా తనకు నచ్చిన భోజనం చేసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.ఇకపోతే సృష్టిలో ఉన్న మిగతా జీవరాశుల విషయానికి వస్తే.

ఒక్కో జీవిది ఒక్కోరకమైన జీవన విధానం.ఇందులో ముఖ్యంగా చిన్న చిన్న జీవులను పెద్ద జీవులు భుజించి జీవనం కొనసాగించే జీవులు ఎన్నో.

TeluguStop.com - వైరల్ వీడియో: కన్న బిడ్డ కోసం ఏకంగా విషసర్పాన్నే ఎదురుకున్న ఎలుక..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక అసలు విషయం వెళితే.తాజాగా ఓ పాము, ఓ తల్లి ఎలుక సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒకరిదేమో కన్నపేగు ఆరాటం.మరొకరేమో ఆకలి.

ఓ పాము తన కడుపు నింపుకోవాలన్న ఉద్దేశంతో ఓ చిట్టి ఎలుకను ఎత్తుకొని వచ్చి తిందామని భావించింది.అనుకున్నదే తరువాయిగా ఓ పాము ఓ చిన్న ఎలుక పిల్లను తినేందుకు ప్రయత్నం చేసింది.

ఈ దశలో ఆ చిన్న ఎలుక తల్లి ప్రాణాలు కొట్టుమిట్టాడాయి.దీంతో ఆ తల్లి ఎలుక విష సర్పంతో పోరాడి తన చిట్టి ఎలుకను కాపాడుకుంది.

ఓ రోడ్డు పై జరిగిన సంఘటన సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఓ చిన్న ఎలుక పాము నోటకరచుకొని రోడ్డుపై వెళ్తుండగా ఆ పామును వెంటాడింది ఓ తల్లి ఎలుక.

అనూహ్యంగా ఎలుక పాము పై దాడి చేయడంతో బెదిరిపోయిన పాము చివరికి తన నోట కరచుకున్న చిన్న ఎలుకను ఆ పాము రోడ్డుపై వదిలేసి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి తప్పించుకొని వెళ్ళిపోయింది.ఆ తర్వాత తల్లి ఎలుక, చిట్టి ఎలుక కలిసి వెళ్లడం ఈ వీడియోలో కనబడుతుంది.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

#Social Media #Snake #Viral Video #Mouse

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kanna Is The Rat Who Faced The Poisonous Snake In Unison For The Baby Related Telugu News,Photos/Pics,Images..