మెయిన్ ఎడిషన్‌కు నల్లరంగు: ఆంక్షలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ మీడియా నిరసన  

Kangaroos Newspapers Black Out Front Pages In \'secrecy\' Protest - Telugu Australia, Newspapers Black Out Front, Nri, Telugu Nri News Updates

ఏ సమాజంలో ప్రభుత్వాలు వార్తాపత్రికలకు స్వేచ్ఛను కల్పిస్తాయో ఆ సమాజం అభివృద్ధివైపు బాటలు వేయగలుగుతుందని ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో జరిగిన సంఘటనల సారాంశం.పత్రికల విశిష్టత ఏంటంటే అవి సమాజాన్ని ప్రతిఫలించడమే కాక సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.

Kangaroos Newspapers Black Out Front Pages In 'secrecy' Protest

కానీ ప్రస్తుత కాలంలో మీడియాపై ఎన్నో ఆంక్షలు.దాని స్వేచ్ఛను హరించి నియంత్రించేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు.

ఈ క్రమంలో మీడియాపై ఆంక్షలను నిరసిస్తూ ఆస్ట్రేలియాలోని ప్రముఖ వార్తాపత్రికలు తమ నిరసనను తెలియజేశాయి.

మెయిన్ ఎడిషన్‌కు నల్లరంగు: ఆంక్షలకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియన్ మీడియా నిరసన-Telugu NRI-Telugu Tollywood Photo Image

సోమవారం న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియాతో పాటు తొమ్మిది పత్రికలు మెయిన్ ఎడిషన్‌లోని తొలి పేజీ అక్షరాలకు నల్లరంగు వేసి దానిపై రహస్యం అనే స్టాంప్‌ను ప్రచురించాయి.

ఈ ఏడాది జూన్ నెలలో ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్‌తో పాటు న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారు.ఈ రెండు సంస్థలు విజిల్‌బ్లోయర్‌ లీక్‌ల ఆధారంగా యుద్ధనేరాలకు సంబంధించిన వివరణాత్మక ఆరోపణలతో పాటు ఆస్ట్రేలియా పౌరులపై నిఘా పెట్టేందుకు ఓ ప్రభుత్వ సంస్థ చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూ కథనాలు ప్రచురించాయి.

ఈ దాడులకు సంబంధించి ముగ్గురు జర్నలిస్టులు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

 దీనిపై మీడియా సమాజం మండిపడింది.తమపై దాడులు, ఆంక్షలను నిరసిస్తూ సోమవారం జరిగిన నిరసన ర్యాలీకి దేశంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, వెబ్ మీడియా సంస్థలు మద్ధతు తెలిపాయి.గత రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన భద్రతా చట్టాలు పరిశోధనాత్మక జర్నలిజానికి ముప్పు తెచ్చాయని.

ప్రజలు తెలుసుకునే హక్కుకు ఇది విఘాతం కలిగించాయని మీడియా ప్రముఖులు తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangaroos Newspapers Black Out Front Pages In \'secrecy\' Protest-newspapers Black Out Front,nri,telugu Nri News Updates Related....