జయలలిత గా కంగనా.. తలైవా మూవీ ట్రైలర్ అదరహో..

ప్రముఖ బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ తాజాగా ఉత్తమ నటీమణి కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తలైవి చిత్రం యొక్క ట్రైలర్ విడుదల అయ్యింది.3 నిమిషాల 8 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఎంజీఆర్‌ గా అరవిందస్వామి, సినీ నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గా కంగనా రనౌత్ బ్రహ్మాండంగా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.

 Kangana Starring Jayalalitha Biopic Thalaivi Movie Trailer Released ,  Jayalalit-TeluguStop.com

కంగనా రనౌత్ చెప్పే డైలాగులు వెంట్రుకలు నిక్క పొడిచేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఈ సినిమా కోసం కంగనారనౌత్ బాగా లావెక్కారు.

ఆమె తన శరీరాకృతిని మార్చుకోవడం పై ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి.ఐతే జయలలిత పాత్ర కోసం తనను తాను మార్చుకునేందుకు కంగనా రనౌత్ ఎంతగా కష్టపడ్డారో ట్రైలర్ లో ఉట్టిపడుతోంది.

అమ్మగా ఆమె కనబరిచిన నటన ప్రస్తుతం సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.రాజకీయాల్లోకి రావాలంటూ ఎంజీఆర్‌ అడగటం.

జయలలిత రాజకీయ రంగ ప్రవేశం చేయడం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి.జయలలిత ప్రధానమంత్రి తో మాట్లాడుతూ ఇంగ్లీషులో దంచికొట్టడం వంటి సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి .బాహుబలి మూవీకి కథ అందించిన విజయేంద్రప్రసాద్ జయలలిత బయోపిక్ కి కథ రాయడం మరొక విశేషం.అసురన్ ఫేమ్ జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం కూడా అదిరిపోయిందనే చెప్పాలి.

అప్పట్లో అసెంబ్లీలో జయలలితకు అవమానం ఎదురైనా విషయం తెలిసిందే.ఆ జీవిత సంఘటనను ఈ ట్రయిలర్ చూపించడం మరో హైలెట్ అని చెప్పుకోవచ్చు.‘మహా భారతంలో కూడా ద్రౌపదికి ఇదే జరిగింది.తన చీరను లాగి అవమానపరిచిన కౌరవుల కథ ముగించి, జడ ముడేసుకుని తన శపథాన్ని నేరవేర్చుకుంది.ఆ మహాభారతానికి ఇంకో పేరుంది.”జయ”!!! ’ అంటూ గర్జించే ఆడ సింహాలా కంగనారనౌత్ డైలాగ్ వదలటం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు.ట్రైలర్ చూస్తుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని స్పష్టమౌతుంది.ఇకపోతే ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube