నాని సినిమాపై నోరుపారేసుకున్న బ్యూటీ

నేచురల్ స్టార్ నాని నటించిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘జెర్సీ’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో నాని నటనకు అందరూ ఫిదా అయ్యారు.

 Kangana Says She Is Unaware Of Nani Jersey Movie-TeluguStop.com

ఈ సినిమాతో నాని తన ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాను నమోదు చేసుకున్నాడు.అయితే తెలుగు సినిమాలను ఎక్కువగా రీమేక్ చేసే బాలీవుడ్‌ జనం ఈ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాను తెలుగులో రీమేక్ చేసిన షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ సినిమాను కూడా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.అయితే బాలవుడ్ వివాదాస్పద హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్, మరోసారి ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించింది.

ఆమె నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పంగా’ చిత్ర విషయాలను మీడియాతో పంచుకున్న ఆమె, షాహిద్ నటిస్తున్న జెర్సీ సినిమా గురించి తనకు అస్సలు తెలియదని అంది.జెర్సీ అనే ఓ సినిమా ఉందన, సౌత్‌లో అది సూపర్ సక్సెస్ అయ్యిందనే విషయం తనకు తెలీదని అంది.

Telugu Bollywood, Jersery, Kangana Ranaut, Nani, Shahid Kapoor-

ఈ బ్యూటీ చేసిన కామెంట్‌తో నాని ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.తెలుగులో సూపర్ సక్సెస్ అయిన సినిమా గురించి ఆమెకు తెలియకపోవడం ఏమిటని, ప్రస్తుతం బాలీవుడ్‌‌లో రీమేక్ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదనడం మూర్ఖత్వం అని పలువురు అన్నారు.కాగా ‘పంగా’ సినిమాలో నటిస్తున్న కంగనా ఓ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తోంది.జనవరి 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు కంగనా చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube