డిజిటల్ కోసం నిర్మాతగా మారుతున్న కంగనా  

Kangana Ready To Built Production House For Digital - Telugu Bollywood, Corona Effect,, Lock Down, Tollywood

ప్రస్తుతం సినిమా పరిస్థితి కరోనా, లాక్ డౌన్ కారణంగా అగమ్యగోచరంగా ఉంది. బడ్జెట్ సినిమాలు తెరకెక్కిస్తున్న థియేటర్లు మూతపడి ఉండటంతో ఎప్పుడు మరల తెరపై సినిమా పడుతుంది అనేది అర్ధం కాని విషయంగా ఉంది.

 Kangana Ready To Built Production House For Digital

ఒక వేళ థియేటర్లు తెరిచిన కూడా భౌతిక దూరం లేని థియేటర్లు వలన కరోనా విస్తరించే ప్రమాదం ఉన్న నేపధ్యంలో బౌతిక దూరం పెంచే ప్రయత్నంలో థియేటర్లు సీట్లు సంఖ్య గణనీయంగా తగ్గించుకోవాలి.అదే సమయంలో షోల సంఖ్య పెంచుకోవాలి.

ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో అర్ధం కాని పరిస్థితి.ఈ నేపధ్యంలో సినిమా పరిశ్రమలో అందరూ లాక్ డౌన్ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.

డిజిటల్ కోసం నిర్మాతగా మారుతున్న కంగనా-Movie-Telugu Tollywood Photo Image

ఇక ఇండస్ట్రీ పరిస్థితిపై కంగనా తన మనసులో మాటని మీడియాతో పంచుకుంది.

లాక్‌డౌన్‌ తర్వాత మన సినిమాలు, వాటి బిజినెస్‌లు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.

అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కూడా ఇప్పుడే ఊహించలేం.కొన్ని కథలను థియేటర్స్‌లో చూస్తేనే చాలా బాగుంటుంది.

కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తే భవిష్యత్‌లో డిజిటల్‌ మీడియమ్‌కి డిమాండ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది.నటిగా నేను సక్సెస్‌ అయ్యాను.

సినిమాలు చేస్తున్నాను.నేను కూడా ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాను.

భవిష్యత్‌లో డిజిటల్‌ వైపు వెళ్లేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను.సృజనాత్మకత కలిగిన వ్యక్తిగా నేను సాధించాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.

కంగనా మాటలు బట్టి చూస్తూ ఉంటే ఇకపై డిజిటల్ మీడియా యాప్స్, థియేటర్లు సినిమాల విషయంలో సమాంతరంగా పని చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ready To Built Production House For Digital Related Telugu News,Photos/Pics,Images..

footer-test