వాళ్లతో పెట్టుకుంది, ఇక షూటింగ్స్‌ కష్టమేనేమో

బాలీవుడ్‌ లో చాలా మంది ప్రముఖులతో సున్నం పెట్టుకున్న కంగనా రనౌత్‌ ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేతో గొడవ పెట్టుకుంది.సుశాంత్‌ మృతి కేసులో మహా ప్రభుత్వంను ఇరుకున పెట్టేలా ఆమె మాట్లాడటంతో పాటు ఏకంగా సీఎం కొడుకుపై వ్యాఖ్యలు చేసింది.

 Kangana Ranaut Controversy With Maharashtra Government, Kangana Ranauth, Siva Se-TeluguStop.com

ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో శివసేన కార్యకర్తలు ఆమెను ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ హెచ్చరించారు.కేంద్రం సాయంతో ఏదోలా ముంబయిలో అయితే అడుగు పెట్టింది.

కానీ ఆమె ఆఫీస్‌ ను కూల్చి వేయడంతో ఆమెపై మహా ప్రభుత్వం పైచేయి సాధించినట్లయ్యింది. కంగనా ఆఫీస్‌ ను కూల్చి వేసిన మహా ప్రభుత్వంకు ఆమెను మరింతగా టార్గెట్‌ చేయడం పెద్ద సమస్య కాదు.

అధికారికంగా లేదా అనధికారికంగా ఆమెను శివసేన టార్గెట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌ లో చాలా మందితో వివాదం పెట్టుకుని సినిమాల విషయంలో ఈమెకు చాలా మంది సహకరించకుండా అయ్యారు.

పెద్ద నిర్మాతలు మరియు దర్శకులు ఈమెతో సినిమా అంటేనే దండం పెట్టి పక్కకు తప్పుకుంటున్నారు.ఇలాంటి సమయంలో ఆమెతో వర్క్‌ చేయాలంటే చిన్న స్టార్స్‌ మరియు టెక్నీషియన్స్ కూడా ఆసక్తి చూపడం లేదు.

అయినా కూడా అన్ని తానై చేసుకోగల సత్తా ఉన్న నటి కంగనా అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన టీం ఉంది.కనుక ఆమె సినిమాలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.కాని ఆమె షూటింగ్స్‌ ఇకపై మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయిలో జరగడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదంటున్నారు.

ఎక్కడికి అక్కడ శివ సేన కార్యకర్తలు షూటింగ్‌ ను అడ్డుకునే అవకాశం ఉందని అంటున్నారు.ఆమె షూటింగ్స్‌ కు వెళ్లిన ప్రతి చోట కూడా శివ సేన కార్యకర్తలు ఉండే అవకాశం ఉంది.

దాంతో ఆమె ఎక్కువగా ముంబయి బయట లేదా మొత్తం మహారాష్ట్ర బయట షూటింగ్స్‌ చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.కనీసం ఏడాది రెండేళ్ల పాటు అయినా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు.

ముంబయిలోని పలు స్టూడియోల అధినేతలతో కంగనా గొడవలు పెట్టుకుంది కనుక ఆమెకు స్టూడియోలు ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు.సో ముందు ముందు కంగనాకు ఫిల్మ్‌ మేకింగ్‌ విషయంలో ఇబ్బందులు తప్పవు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube