హృతిక్ మంచోడిలా కనిపిస్తున్నాడంటూ మరోసారి కంగనా?  

బాలీవుడ్ ఇండస్ట్రీలో కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కంగనా గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.

TeluguStop.com - Kangana Ranaut Takes A Dig At Hrithik Roshan

కంగనా ఎలాంటి విషయాలలో భయపడకుండా తనకు నచ్చినది సోషల్ మీడియా ద్వారా నిర్మొహమాటంగా ట్వీట్ చేయడం ద్వారా తీవ్ర విమర్శల పాలవుతున్నారు.తన గురించి ఎవరు ఏమనుకున్నా తను చెప్పాల్సింది మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు.

తాజాగా ముంబై హైకోర్ట్ ఆఫీస్ కూల్చివేత విషయంలో కంగనా కు మద్దతుగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే కోర్టు తీర్పుపై స్పందించిన బృహన్ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎం‌సీ) మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

TeluguStop.com - హృతిక్ మంచోడిలా కనిపిస్తున్నాడంటూ మరోసారి కంగనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీనిపై స్పందించి కోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నామని, కంగనాను “రెండు రకాల స్వభావాలు” ఉన్న వ్యక్తి అని వ్యాఖ్యానించడం పై ఆమె మండిపడ్డారు.

గత కొంత కాలం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కంగన ఎదుర్కొంటున్న కేసులు, అవమానాలు, వేధింపులను చూస్తుంటే…బాలీవుడ్‌ మాఫియాఆదిత్యా పంచోలీ, హృతిక్‌ రోషన్‌ ఇలాంటి వ్యక్తులు చాలా మంచివారు గా కనిపిస్తున్నారు అంటూ కంగనా ట్వీట్ చేశారు.2013లో క్రిష్ 3 సినిమా ద్వారా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది.అయితే ఈ విషయంపై హృతిక్ రోషన్ ఏ మాత్రము స్పందించలేదు.

అయితే ఓ ఇంటర్వ్యూలో కంగనా హృతిక్ రోషన్ తో డేటింగ్ లో ఉన్నామని తెలియజేయడంతో దీనిపై స్పందించిన హృతిక్ రోషన్ ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.

అంతే కాకుండా ఇద్దరు కలిసి నటించడానికి సంతకం చేసిన సినిమా నుంచి తొలగించినట్లు కూడా సమాచారం అయితే ఇది చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కారణం అయినప్పటికీ ఈ కేసుపై ఎటువంటి స్పష్టత రాలేదు.

అప్పటినుంచి హృతిక్ రోషన్, కంగనా మధ్య మాటలు కూడా లేవని చెప్పవచ్చు.వీరిద్దరి మధ్య మాటలు లేకపోయినా పలుమార్లు కంగనా హృతిక్ రోషన్ గురించి మాజీ ప్రియుడు అంటూ సంబోధించారు.

#Hrithik Roshan #Maharastra #Boyfriend #Kangana Ranaut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు