తాప్సి-కంగనా మధ్య మాటల యుద్ధం! ఒకరిపై ఒకరు విమర్శలు  

War Between Kangana Ranaut and Taapsee Pannu, Bollywood, Tollywood, Nepotism, Social Media - Telugu Bollywood, Nepotism, Social Media, Tollywood, War Between Kangana Ranaut And Taapsee Pannu

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కొంత మంది సెలబ్రెటీ స్టార్స్ నెపాటిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మరికొంత మంది నెపోటిజం అనేది ఎక్కడైనా ఉంటుందని, సెలబ్రెటీలు తమ పిల్లలని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

 Kangana Ranaut Taapsee Pannu Bollywood Tollywood

అయితే బంధుప్రీతి అనేది ఎక్కడైనా ఉండేదే అయినా టాలెంటెడ్ నటులకి వచ్చే అవకాశాలని కూడా బంధుప్రీతి ఉపయోగించుకొని కొందరు సొంతం చేసుకొని టాలెంటెడ్ నటులకి అవకాశాలు లేకుండా, ఎదగనీయకుండా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే బాలీవుడ్ లో తాప్సి, కాంగానా రనౌత్ ఇద్దరు నెపోటిజం బాధితులే.

తాప్సి-కంగనా మధ్య మాటల యుద్ధం ఒకరిపై ఒకరు విమర్శలు-Movie-Telugu Tollywood Photo Image

ఇద్దరూ కూడా దీనికి వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తున్నారు.అయితే వీరి మధ్య మళ్ళీ మాటల దాడి ఎక్కువైంది.

ఈ మధ్య తాప్సి సోలోగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.కాంగానా స్టార్ హీరోయిన్ అయిపోయి తన రేంజ్ పెంచుకుంది.

ఇద్దరు ఒకే దారిలో వెళ్తున్న వారే అయినా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.ఈ నెపోటిజం విషయంలో కూడా ఇద్దరు తమ మధ్య ఉన్న విభేదాలు చూపించుకుంటున్నారు.

ఇటీవల తాప్సీ తాను నెపోటిజం బాధితురాలిని అంటూ చేసిన వ్యాఖ్యలపై కంగన స్పందిస్తూ సినీ నేపథ్యం లేకుండా వచ్చినవారు కూడా మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది.తాప్సీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నామని పోస్ట్ చేసింది.

ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని వ్యాఖ్యానించింది.అలాంటి వారి పట్ల కూడా మనం మంచిగానే ఉండాలని వారి గురించి ప్రార్థనలు చేద్దామని చెప్పింది.

#Social Media #Nepotism

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Taapsee Pannu Bollywood Tollywood Related Telugu News,Photos/Pics,Images..