పోలియో ఉన్న కూడా తెగువ చూపిస్తున్న కంగన రనౌత్.. ??

కంగన అభిమానులు ఆ హెడ్ లైన్ చూసి ఆశ్చర్యపోయే ముందు అసలు విషయాన్ని తెలుసుకుందామా.ఇంతకు మ్యాటర్ ఏంటంటేటాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి ఇక్కడ నిర్మించే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.

 Kangana Ranaut Showing Courage Even With Polio, Kangana Ranaut, Manikarnika, Mov-TeluguStop.com

అందుకు ఉదాహరణగా ఒకప్పటి లేడీ స్టార్ విజయశాంతి నుండి ప్రస్తుతం అనుష్క వరకు కూడా ఈ కోవకు చెందిన చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకున్నారు.

అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో కంగన రనౌత్ ఇలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఆమధ్య వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయిగా ఆమె ప్రదర్శించిన అభినయం ఆ చిత్రాన్ని విజయం వైపు నడిపించింది.కాగా ఇదే చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్టు కంగన ఈరోజు ప్రకటించింది.

అంతే కాదు మణికర్ణిక రిటర్న్స్ ద లెజండ్ ఆఫ్ దిద్దా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.

ఇకపోతే మహ్మద్ గజనీని రెండుసార్లు యుద్ధంలో ఓడించిన ధీరవనిత దిద్దా జీవిత గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందట.

పోలియో కారణంగా చచ్చుబడిన కాలు ఉన్న కశ్మీర్ మహారాణి, యోధురాలు దిద్దా యుద్ధంలో చూపిన తెగువ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఈ పాత్రలో కంగనా పూర్తిగా ఒదిగిపోతుందనే టాక్ వినిపిస్తుంది.కాగా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube