తలైవిలో ఆ పాట కోసం జ్వరంతో 16 గంటలు వర్షంలో తడిచిన కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ భామ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతుంది.

 Kangana Ranaut Shot In The Rain For 16 Hours-TeluguStop.com

మరో వైపు నటిగా వరుసగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ తనదైన గుర్తింపుతో దూసుకుపోతుంది.హీరోలతో సమానంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా కథలతో సినిమాలు చేస్తూ వారి స్థాయిలోనే కలెక్షన్స్ కూడా రాబడుతుంది.

ఆమె నటించిన మణికర్ణిక ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.వారియర్ క్వీన్ గా ఆ సినిమాలో ఆమె నటనకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

 Kangana Ranaut Shot In The Rain For 16 Hours-తలైవిలో ఆ పాట కోసం జ్వరంతో 16 గంటలు వర్షంలో తడిచిన కంగనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నటిగా తనని తాను బెస్ట్ అని చెప్పుకునే కంగనా ఆ విధంగానే తెరపై కూడా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన తలైవి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.

ఇప్పటికే తలైవి సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.జయలలిత పాత్రలోకి కంగనా పరకాయ ప్రవేశం చేసి జీవించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

నటిగా, రాజకీయ నాయకురాలిగా జయలలిత ప్రస్థానం ఎలా సాగింది ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి వాన పాట ఒకటి ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కంగనా రనౌత్‌ అలవోకగా డ్యాన్స్‌ చేశారు.కానీ, ఆ పాట చిత్రీకరణ వెనక పెద్ద కష్టం ఉంది.

జయలలిత డ్యాన్స్‌ని తలపించేలా ఈ పాటలో కంగనా నర్తించింది.మొత్తం మూడు రోజులు ఈ పాట చిత్రీకరణ సాగింది.

ఈ పాట కోసం మూడు రోజుల్లో దాదాపు 16 గంటలు కంగనా తడవాల్సి వచ్చింది.సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు జ్వరం వచ్చింది.

అయినప్పటికీ లెక్క చేయకుండా, షూట్‌లో పాల్గొన్నారు.విశ్రాంతి తీసుకుని కోలుకున్నాక చిత్రీకరించవచ్చని చిత్రబృందం చెప్పినప్పటికి కంగనా మాత్రం తన కారణంగా షూటింగ్‌ ఆగకూడదనుకున్నారట.

ఆమె కమిట్‌మెంట్‌ని చిత్రబృందం అభినందిస్తోంది.తాజాగా దర్శకుడు కంగనా కమిట్మెంట్ గురించి చెబుతూ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.

#Kangana Ranaut #AL Vijay #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు