బాలీవుడ్ హీరోలపై వైరల్ కామెంట్స్ చేసిన కంగనా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

 Kangana Ranaut Sensational Comments On Bollywood Industry, Kangana Ranaut, Sensa-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా కంగనా ప్రధాన పాత్రలో తలైవి సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమా జయలలిత బయోపిక్ గా రూపొందుతుంది.

ఈ సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలయ్యి తమిళనాడులో తీవ్ర చర్చకు దారి తీసింది.

రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.కంగనా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ తలైవి ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులకు ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి.

ఈ సినిమాలో కంగనా ను చుస్తే జయలలితను చూసి నట్టుగానే ఉందని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

కంగనా అంతలా ఈ పాత్ర లో జీవించింది.అభిమానులే కాదు ప్రముఖులు కూడా ఈ ట్రైలర్ చూసి కంగనాకు పొగడ్తలతో ముంచెత్తారు.

ఈ సినిమాను ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసారు.

తలైవి సినిమా ఏప్రిల్ 23 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.

Telugu Bollywood, Bollywood Stars, Kangana, Kangana Ranaut, Sensational, Thalaiv

ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చినప్పటికి మేకర్స్ మాత్రం అదే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఈ నేపథ్యంలో కంగనా బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వారు వేధించి నన్ను చుట్టుముట్టారు.

ఈ ఇండస్ట్రీ నుండి పంపాలని చాలా పనులు చేసారు.కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులందరూ దాక్కున్నారు.

కానీ నేను నా బృందంతో బాలీవుడ్ ను కాపాడడానికి 100 కోట్ల సినిమాతో వస్తున్నా.అంటూ కంగనా తెలిపింది.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube