ఓటీటీలను ఆ సైట్లతో పోల్చిన కంగనా రనౌత్..?  

kangana ranaut sensational comments about ott platforms, Kangana Ranaut, Bollywood Actress, OTT Platform,Bold Content Movie, Kangana Commens - Telugu Bold Content Movie, Bollywood Actress, Kangana Commens, Kangana Ranaut, Kangana Ranaut Sensational Comments About Ott Platforms, Kangana Twitter, Ott Platform

గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ వ్యాఖ్యలకు మద్దతు పలికే వాళ్లు ఎంతమంది ఉన్నారో ఆమె వ్యాఖ్యలపై విమర్శలు చేసేవాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు.

TeluguStop.com - Kangana Ranaut Sensational Comments About Ott Platforms

సుశాంత్ మృతి తరువాత నెపోటిజం గురించి వ్యాఖ్యలు చేసి కంగనా రనౌత్ వార్తల్లో నిలిచారు.

మహారాష్ట్ర సర్కార్ పై కూడా విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

TeluguStop.com - ఓటీటీలను ఆ సైట్లతో పోల్చిన కంగనా రనౌత్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాజకీయ నేతలపై, ప్రముఖ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో ఆమె విమర్శలు చేశారు.డ్రగ్స్ వ్యవహారంపై కంగనా చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.

అయితే ప్రముఖులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కంగనాను కొందరు నడి రోడ్డుపై రేప్ చేస్తామంటూ బెదిరించారు.తాజాగా ఓటీటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి కంగనా వార్తల్లో నిలిచారు.

ఓటీటీ సైట్లను కంగనా రనౌత్ ఏకంగా అశ్లీల సైట్స్ తో పోల్చారు.ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై విమర్శలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.ప్రేక్షకులు సినిమాలను థియేటర్లలో మాత్రమే వీక్షించాలని.కళ డిజిటలైజేషన్ వల్ల పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆమె అన్నారు.

ఒక సినిమాను థియేటర్లలో చూసిన అనుభవానికి, ఓటీటీలో చూసిన అనుభవానికి తేడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

అన్ని ఓటీటీలు లైంగిక కంటెంట్ తోనే వీక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.

కంగనా చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కంగనా తీరుపై విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది విశ్లేషకులు కంగనా తీరు సరికాదని చెబుతుండటం గమనార్హం.కంగనా చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో ఆమెకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

.

#KanganaRanaut #Kangana Twitter #Kangana Ranaut #OTT Platform #Kangana Commens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Sensational Comments About Ott Platforms Related Telugu News,Photos/Pics,Images..