నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. కంగనా సంచలన వ్యాఖ్యలు..!

ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా కంగనా హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Kangana Ranaut Sensational Comments About Hrithik Roshan-TeluguStop.com

దాదాపు పది సంవత్సరాల క్రితం కైట్స్ అనే మూవీలో కంగనా హృతిక్ కలిసి నటించారు.కైట్స్ మూవీ షూటింగ్ సమయంలో హృతిక్, కంగనా మధ్య ప్రేమ పుట్టగా వాళ్ల ప్రేమ బంధం వివాహ బంధంగా మారుతుందని అందరూ భావించారు.

కంగనా, హృతిక్ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఆ సమయంలో జోరుగా ప్రచారం జరిగింది.అయితే ఊహించని విధంగా కంగనా, హృతిక్ వేర్వేరు కారణాల వల్ల విడిపోవడం జరిగింది.

 Kangana Ranaut Sensational Comments About Hrithik Roshan-నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. కంగనా సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రేమలో ఉన్న సమయంలో కంగనా, హృతిక్ ఒకరికొకరు పంపుకున్న మెయిల్స్ వివాదానికి కారణం కాగా హృతిక్ మాత్రం ఆ ఈమెయిల్ ఐడీ తనది కాదని ఎవరో తన పేరుతో ఫేక్ ఈమెయిల్స్ పంపించారని చెప్పారు.

ఈ నకిలీ ఈమెయిల్ కు సంబంధించి హృతిక్ ఫిర్యాదు చేయడంతో పాటు కంగనానే ఈమెయిల్ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నకిలీ ఈమెయిల్ కు సంబంధించి తాజాగా ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ హృతిక్ రోషన్ ను పిలిపించడంతో పాటు అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.అయితే హృతిక్ పోలీసుల దగ్గరకు వెళ్లి వాంగ్మూలం ఇస్తున్న నేపథ్యంలో కంగనా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Telugu Fake Emails, Hrithik Roshan, Kangana Ranaut, Kites Movie, Sensational Comments-Movie

ప్రపంచం చాలా మారిపోయిందని.అయితే తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ మాత్రం ఇంకా అందులోనే చిక్కుకుపోయాడని కంగనా అన్నారు.తన ప్రియుడు సిల్లీగా అక్కడే ఆగిపోయాడని.కాలం వెనుకకు వెళ్లకపోయినా తన ప్రియుడు వెనుకకు వెళ్లి వివాదాన్ని తిరగదోడి అందులో నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నాడని కంగనా పేర్కొన్నారు.

#Kangana Ranaut #Fake Emails #Hrithik Roshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు