నా సోదరికి 53 సర్జరీలు జరిగాయ్ అంటున్న కంగనా.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం గురించి అందరికీ గెలిచింది.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని ముక్కుసూటి మనిషి గా ఇండస్ట్రీలో నిలిచింది.

 Kangana Ranaut Says Yoga Helped Sister Rangoli After Acid Attack-TeluguStop.com

ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే ఉంటాం.నిజానికి ఆమె తన నటన కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఏదో ఒక విషయం తో కౌంటర్ వేస్తూనే ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన సోదరికి జరిగిన సర్జరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

 Kangana Ranaut Says Yoga Helped Sister Rangoli After Acid Attack-నా సోదరికి 53 సర్జరీలు జరిగాయ్ అంటున్న కంగనా.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈరోజు అంతర్జాతీయ యోగ డే సందర్భంగా తన సోదరికి జరిగిన ప్రమాదం గురించి కొన్ని విషయాలు పంచుకుంది కంగనా.తన అక్క రంగోలీ 21 సంవత్సరాల వయసున్న సమయంలో ఓ ఆకతాయి తనను ప్రేమిస్తున్నానని వెంట పడినప్పుడు అతను తన అక్క నో చెప్పినందుకు యాసిడ్ దాడికి పాల్పడ్డాడట.

ఈ ఘటనలో రంగోలీ ముఖం కాలిపోగా కంటి చూపు కోల్పోయిందట.చెవి కూడా పూర్తిగా కాలి పోయిందట.

ఛాతి భాగం కూడా బాగా దెబ్బ తినడంతో మూడేళ్లలో 53 సర్జరీలు జరిగాయని తెలిపింది.యాసిడ్ దాడికి ముందు తనకు ఓ ఎయిర్ ఫోర్స్ అధికారితో ఎంగేజ్మెంట్ అవ్వగా.

తన సోదరి ముఖం చూసి వదిలి వెళ్ళిపోయాడట.దాంతో ఆమె మానసికంగా బాగా గురవగా మాట్లాడడం కూడా మానేసిందట.

ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడినా సమాధానం చెప్పేది కాదట.దాంతో ఎంతోమంది మానసిక నిపుణులను కలిసిందట.

Telugu Acid Attack, Bollywood, Kangana Ranaut, Sister Rangoli, Tollywood, Yoga-Movie

చాలా మందులు కూడా వాడినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయిందట.ఇక ఓసారి కంగనా తనతో పాటు తనని కూడా యోగా శిక్షణకు తీసుకెళ్ళిందట.ఇక తన అక్క తనతోపాటు యోగ చేయడం ప్రారంభించిందట.అలా తన జీవితం ఎంతో మారిందని తనతో మాట్లాడటం ప్రారంభించిందని తెలిపింది.కంటి చూపు కూడా కొంతవరకు నయమైందని తెలిపింది కంగనా.

#Kangana Ranaut #Sister Rangoli #Acid Attack #Yoga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు