విజయేంద్ర ప్రసాద్ సీతగా కంగనా మారబోతుందా! సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తుంది.అలాగే పీరియాడిక్, మైథలాజికల్ కథలని మళ్ళీ బయటకి తీసి తెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు రెడీ అవుతున్నారు.

 Kangana Ranaut Replace To Kareena In Vijayendra Prasad Sita-TeluguStop.com

ప్రభాస్ హీరోగా ఆది పురుష్ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బాలీవుడ్ లో తెరకెక్కుతుంది.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న కథ కావడం విశేషం.

మరో వైపు అల్లు అరవింద్ భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రామాయణం ఇతిహాసాన్ని కంప్లీట్ గా మూడు భాగాల సిరీస్ గా నిర్మించబోతున్నారు.మరో నిర్మాతతో కలిసి ఈ మూవీని తెరకెక్కించే పనిలో పడ్డారు.

 Kangana Ranaut Replace To Kareena In Vijayendra Prasad Sita-విజయేంద్ర ప్రసాద్ సీతగా కంగనా మారబోతుందా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ మూవీలో రావణుడుగా హృతిక్ రోషన్ కనిపిస్తాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు రామాయణం ఆధారంగానే విజయేంద్ర ప్రసాద్ సీత టైటిల్ తో ఒక స్టొరీ సిద్ధం చేశాడు.

ఈ మూవీని కూడా ఇప్పటికే అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.అలౌకిక రాయ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం కరీనా కపూర్ ని ఫైనల్ చేశారని టాక్ వచ్చింది.ఇక ఈ సినిమాలో నటించడం కోసం ఆమె ఏకంగా 12 కోట్లు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటుందని బి టౌన్ లో వినిపించింది.

అయితే చిత్ర నిర్మాతల నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

సీత మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో అన్ని బాషలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఈ నేపధ్యంలో సౌత్ ఇండియా ప్రేక్షకులకి కరీనా కపూర్ అంతగా రీచ్ అయ్యే అవకాశం లేదని ఫిలిం సర్కిల్ లో వినిపిస్తుంది.

సౌత్ లో సీత క్యారెక్టర్ కి విపరీతంగా ఫలోవర్స్ ఉన్నారు.ఈ నేపధ్యంలో ఆ పాత్రలో కనిపించే నటి సౌత్ లో కాస్తా ఫేమ్ ఉన్న హీరోయిన్ అయితే బెటర్ అని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో సీత పాత్ర కోసం కంగనా రనౌత్ పేరుని కూడా పరిశీలిస్తున్నట్లు బోగట్టా.ఇక నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కంగనానే సీత పాత్రకి తీసుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

అలాగే సీతగా కరీనా కపూర్ ని ఎంపిక చేయడంపై హిందుత్వ సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపధ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు వినికిడి.

#Kangana Ranaut #Ramayanam #KareenaKapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు