తన కలలని అత్యాచారం చేశారు అంటున్న కంగనా  

Kangana Ranaut Once Again React on demolition of her Mumbai office, Bollywood, Mumbai, Shiv Sena, Kangana Ranaut, Maharashtra - Telugu Bollywood, Kangana Ranaut, Kangana Ranaut Once Again React On Demolition Of Her Mumbai Office, Maharashtra, Mumbai, Shiv Sena

బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి నుంచి సెలబ్రిటీ ఫ్యామిలీస్, నెపోటిజం అంటూ ఒక వర్గాన్ని టార్గెట్ చేసే కంగనా రనౌత్ సుశాంత్ ఆత్మహత్య తర్వాత తన స్వరం మరింత పెంచింది.బాలీవుడ్ లో మాఫియా నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ మాఫియా కుట్రల కారణంగానే సుశాంత్ చనిపోయాడని కామెంట్స్ చేసింది.

TeluguStop.com - Kangana Ranaut Once Again React On Demolition Of Her Mumbai Office

తరువాత ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వచ్చింది.ఇక సుశాంత్ డెత్ మిస్టరీలో డ్రగ్స్ వ్యవహారం బయట పడటంతో బాలీవుడ్ లో డ్రగ్స్ లింకుల గురించి మాట్లాడింది.

ఎవరెవరు ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటారు అనే విషయాన్ని చెప్పింది.అదే సమయంలో సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు సీరియస్ నెస్ లేకుండా పని చేశారని, అక్కడి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి కుమారుడు ఆదిత్య థాక్రేని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సంచలన విమర్శలు చేసింది.

TeluguStop.com - తన కలలని అత్యాచారం చేశారు అంటున్న కంగనా-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.కంగనా వ్యాఖ్యలపై శివసేన నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.
అదే సమయంలో అధికారంలో ఉండటంతో కంగనా ఆస్తులపై ఫోకస్ పెట్టారు.ఆమెని మానసికగా దెబ్బ తీయడానికి తమ దగ్గర ఉన్న అవకాశాలు వాడుకొని ముంబైలో కంగనా సినిమా ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ ముంబై కార్పోరేషన్ ద్వారా నోటీసులు ఇప్పించి కూల్చేశారు.

అలాగే ఆమె ఇల్లు కూడా అక్రమ కట్టడం అంటూ నోటీసులు జారీ చేశారు.ఈ వ్యవహారంపై కంగనా మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేసింది.కూల్చివేసిన త‌న ఆఫీసుకు సంబంధించిన శిథిలాల ఫొటోల‌ను పోస్టు చేస్తూ ఆమె తీవ్ర‌మైన వ్యాఖ్యలు చేసింది.త‌న స్వ‌ప్నాల‌ను రేప్ చేశారు అంటూ ఆమె ట్వీట్ చేసింది.

త‌న క‌ల‌ల సౌధాన్ని కూల్చేశార‌ని వాపోయింది.త‌న క‌ల‌ల‌ను, త‌న ప్రేర‌ణ‌ను, త‌న భ‌విష్య‌త్తును అత్యాచారం చేశారంటూ ఆమె రాసుకొచ్చింది.

వాళ్లు ఏం చేశారు.రేప్ కాదా అంటూ ప్ర‌శ్నించింది.

త‌న దేవాల‌యం శ్మ‌శానంగా మారిందంటూ కంగ‌నా వాపోయింది.వాళ్లు త‌న స్వ‌ప్నాల‌ను విచ్ఛిన్నం చేశారంటూ శివసేన సర్కార్ పై కంగనా విరుచుకుపడింది.

#Maharashtra #KanganaRanaut #Mumbai #Kangana Ranaut #Shiv Sena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Once Again React On Demolition Of Her Mumbai Office Related Telugu News,Photos/Pics,Images..