బాయ్ ఫ్రెండ్ తో కంగనా బ్రేకప్.. ఇన్ స్టాలో రచ్చ రచ్చ!

Kangana Ranaut Hints At Heartbreak

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

 Kangana Ranaut Hints At Heartbreak-TeluguStop.com

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధం లేని విషయాలపై కూడా ఈమె స్పందిస్తూ ఉంటుంది. వివాదాస్పద విషయాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్  స్టోరీస్ లో షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.ఆమె తన ఒంటరితనాన్ని కవిత రూపంలో వివరించిన తీరు నెటిజన్లను ఆలోచింప చేస్తోంది.నీకోసమే నేను జీవించా.కానీ నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు.

 Kangana Ranaut Hints At Heartbreak-బాయ్ ఫ్రెండ్ తో కంగనా బ్రేకప్.. ఇన్ స్టాలో రచ్చ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనే ఎమోషనల్ కోట్స్ ప్రస్తుతం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈమె చేసిన పోయెట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

దీనిని బట్టి చూస్తే ఆమె లవ్ కు బ్రేకులు పడ్డాయేమో అని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Bollywood, Boy Friend, Break, Kangana Ranaut-Movie

ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో కంగనా ప్రేమ విఫలం అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ పోస్టుకు కొన్ని రోజుల ముందు ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు తల్లి కావాలని ఉంది అని, అలాగే తాను ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నానని తెలిపింది.అతడిని త్వరలోనే మీ అందరికి పరిచయం చేస్తాను అని కంగనా పేర్కొనడం గమనార్హం.

ఇలా ఈ బాలీవుడ్ బ్యూటీ ఏదో ఒక విషయం ద్వారా తీవ్ర వివాదాన్ని సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.అయితే సోషల్ మీడియాలో తన బ్రేకప్ గురించి వస్తున్న వార్తల గురించి ఈమె ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

#Break #Kangana Ranaut #Boy Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube