ఆ డ్రెస్ కొనేందుకు డబ్బులు లేవంటున్న కాంట్రవర్సీ హీరోయిన్..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్.తన నటన, అందం తో మెప్పించడమే కాకుండా ముక్కుసూటి మనిషిగా అభిమానుల మనసులో నిలిచిపోయింది.కంగనా కు నటన పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది.తను నటించిన సినిమాలు కొన్ని అయితే ఆ సినిమాలలో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డులు అందాయి.

 Kangana Ranaut.,designer Outfit, National Award Ceremony, Money,actress Kangana-TeluguStop.com

ఇటీవలె కంగనా ఓ డ్రస్ కొనేందుకు డబ్బులు లేవని అనగా ఆ మాటతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎప్పుడు తనదైన శైలితో అందంగా కనిపిస్తూ తన వేసుకునే దుస్తుల లో రకరకాల డిజైన్ల తో మెప్పిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది కంగనా.

తొలిసారిగా 2006లో హీరోయిన్ నటించిన గాంగ్ స్టర్ సినిమా మంచి హిట్ ను సాధించగా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు కూడా దక్కింది కంగనా కు.అలాగే మరి కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.ఇదిలాఉంటే ఈమె ధరించే దుస్తులలో ఎక్కువగా డిజైనర్ దుస్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంది.అలాంటి కంగనాకు తానే సొంతంగా రూపొందించుకున్న డిజైన్ డ్రెస్ ను కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని తెలిపింది.

మహిళల గురించి గొప్పగా తెలిపిన సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ తన పాత్ర ద్వారా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో తన పాత్ర అందరిని ఆకట్టుకోగా ఉత్తమ సహాయ కథానాయిక అవార్డు దక్కింది.ఈ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అందుకుంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా తను వేసుకున్న అనార్కలి డ్రెస్ కొనుగోలు చేయడానికి సరిపడు డబ్బులు లేవని తెలిపింది.

కాగా ఆ డ్రెస్ డిజైన్ ను తానే రూపొందించుకోగా.చూడటానికి ఆ డ్రెస్సులో మరింత అందం గా కనబడింది కంగనా.నలుపు రంగు తో కూడిన ఈ డ్రెస్ ఎరుపు, ఆకుపచ్చని కాంబినేషన్ లో గోల్డ్ బార్డర్ తో అందంగా కనిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube