కంగనాకు ఘోర పరాభవం.. 90 కోట్ల బడ్జెట్ పెడితే 3 కోట్లు వసూలు..ఓటిటి డీల్ కూడా జీరో!

కంగనా రనౌత్. ఈ పేరు తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.

 Kangana Ranaut Dhaakad Movie Collections Details, Dhaakad Movie, Kangana Ranaut, Dhaakad Movie Collections, Kangana Dhaakad Movie, Dhaakad Movie Flop, Fire Brand Kangana Ranaut-TeluguStop.com

ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమె సుపరిచితమే.

ఈమె నటన పరంగా ఎవ్వరు వేలెత్తి చూపించేలేరు.అయితే బయట మాత్రం అన్ని విషయాల్లో కల్పించుకుని ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 Kangana Ranaut Dhaakad Movie Collections Details, Dhaakad Movie, Kangana Ranaut, Dhaakad Movie Collections, Kangana Dhaakad Movie, Dhaakad Movie Flop, Fire Brand Kangana Ranaut-కంగనాకు ఘోర పరాభవం.. 90 కోట్ల బడ్జెట్ పెడితే 3 కోట్లు వసూలు..ఓటిటి డీల్ కూడా జీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఈమెను ఫైర్ బ్రాండ్ అంటారు.టాప్ హీరోలను అయినా సరే ముచ్చెమటలు పట్టించగల సత్తా ఉంది.ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా కొనగడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది.అయితే ఈమెకు వరుస పరాజయాలు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ నటించిన ధాకడ్ పెద్ద ప్లాప్ ను మూటగట్టుకుంది.

జీరో ఆడియెన్స్ కారణంగా థియేటర్స్ లో ఈ సినిమాను తీసేస్తున్నారు.మొదటి మూడు రోజులు అతిదారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.

ఇక సోమవారం నుండి అయితే చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా తొలి వెకెండ్ లో కేవలం కోటిన్నర మాత్రమే రాబట్టింది.

శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ఏ మాత్రం రాబట్టలేక పోయింది.

ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ 3 కోట్ల రూపాయలు మాత్రమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఇక థియేటర్ లో పరిస్థితి ఇలా ఉంటే ఇక ఓటిటి దగ్గర కూడా ఈ సినిమాకు పరాభవం తప్పలేదు.శాటిలైట్, డిజిటల్ అమ్మకం ద్వారా కూడా ధాకడ్ జీరో ఆదాయం అని తెలుస్తుంది.

ఈ సినిమా నిర్మాతలు రిలీజ్ కు ముందు భారీ ఆఫర్స్ వచ్చినా ఇంకా పెద్ద మొత్తం వస్తాయని ఆశించి అమ్మలేదు.

దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఘోర పరాజయం పొందడంతో ఇప్పుడు ఓటిటి వాళ్ళు కూడా ఈ సినిమాను పట్టించు కోవడం లేదు.

ఇలా ఈ సినిమాను 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తే నిర్మాతలకు కేవలం 3 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే తెచ్చిపెట్టింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube