కంగనా వ్యాఖ్యలతో ఫిదా అవుతున్న టాలీవుడ్‌ జనాలు  

Kangana Ranaut comments on Tollywood Industry , kangana ranaut, tollywood industry, drugs probe, bollywood - Telugu Baahubali, Bollywood, Drugs Probe, Kangana Ranaut, Kangana Ranaut Comments On Tollywood Industry, Ramoji Film City, Tollywood, Tollywood Industry

ఈమద్య కాలంలో కంగనా ఏం మాట్లాడినా సంచలనంగానే ఉంది.ఆమె తనపై ఎవరైనా చిన్న కామెంట్‌ చేసినా కూడా వారిని వదిలి పెట్టకుండా వారి పుట్టు పూర్వొత్తరాల వరకు మొత్తం లాగేస్తుంది.

TeluguStop.com - Kangana Ranaut Comments On Tollywood Industry

వారిని మరో మాట మాట్లాడకుండా నోరు ఎత్తకుండా కౌంటర్‌ ఇస్తుంది.ఇటీవల ఊర్మిళ డ్రగ్స్‌ గురించి మాట్లాడిన సమయంలో ఏకంగా ఆమెను పోర్న్‌ స్టార్‌ అంటూ కంగనా చేసిన విమర్శలు మొత్తం బాలీవుడ్‌ నే కుదిపేశాయి.

అయినా కూడా ఆమెను మందలించేందుకు ఆమెకు కౌంటర్‌ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు.అంతలా ఆమె ట్వీట్స్ కు బాలీవుడ్‌ జనాలు భయపడుతున్నారు.

TeluguStop.com - కంగనా వ్యాఖ్యలతో ఫిదా అవుతున్న టాలీవుడ్‌ జనాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్‌ కంగనా ఎప్పుడెప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అంటూ గత నెల రోజులుగా ప్రతి రోజు ఆమె ట్విట్టర్‌ హ్యాండిల్‌ ను చూస్తూ ఉన్నారు.నేడు ఆమె టాలీవుడ్‌ పరిశ్రమను పొగడ్తలతో ముంచెత్తి అభినందించింది.

బాలీవుడ్‌ కంటే కూడా టాలీవుడ్‌ గొప్ప సినిమా పరిశ్రమ అన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేయడంతో అంతా ఫిదా అవుతున్నారు.

సీఎం యోగి ఆధిత్య నాద్‌ యూపిలో అతి పెద్ద ఫిల్మ్‌ స్టూడియో ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో కంగనా స్పందిస్తూ.

అంతా అనుకుంటున్నట్లుగా దేశంలో అతి పెద్ద సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్‌ కాదు.హిందీ సినిమా పరిశ్రమ కంటే పెద్దది తెలుగు సినిమా పరిశ్రమ.తెలుగులో ఎన్నో పాన్ ఇండియా మూవీలు తెరకెక్కుతున్నాయి.చాలా వరకు భాష భేదం లేకుండా వారి సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

ఇక హిందీకి చెందిన చాలా సినిమాలు కూడా రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.కనుక ఆ భాష గొప్ప ఈ భాష తక్కువ అని ఎవ్వరు భావించవద్దంటూ బాలీవుడ్‌ ప్రముఖులను సున్నితంగా హెచ్చరించింది.

బాలీవుడ్‌ టాలీవుడ్‌ అని కాకుండా ఇండియన్‌ సినీ పరిశ్రమ అంటూ ఒకటి ఉండాలంటూ కంగనా అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ విషయంలో మాత్రం ఆమెతో మొత్తం తెలుగు వారు కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియన్‌ ప్రముఖులు అంతా కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

సౌత్‌ సినీ అభిమానులు ఆమెకు కృతజ్ఞతలు చెప్తున్నారు.

#KanganaRanaut #Kangana Ranaut #Baahubali #Drugs Probe

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kangana Ranaut Comments On Tollywood Industry Related Telugu News,Photos/Pics,Images..